దిల్ రాజు తెలివికి హ్యాట్సాఫ్
ఈ వారం రిలీజ్‌కు అన్నీ రెడీ చేసుకున్న జనక అయితే గనక సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇప్పటికే థియేటర్ల కేటాయింపు పూర్తైంది. ముందు రోజు ప్రీమియర్లు ఎక్కడ వేయాలో కూడా లిస్ట్ చేసుకున్నారు. కానీ ఈ లోపు నిర్మాత దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయం మూవీ లవర్స్ ను ఆశ్చర్యపరుస్తుంది.
వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతమవుతున్న ఈ టైమ్ లో ఆడియన్స్ థియేటర్లకు వచ్చే మూడ్ లో లేరనే ఆద్దేశంతోనే వాయిదా వేశారని అంటున్నప్పటికీ దిల్ రాజు టీమ్ చేసిన ప్రాక్టికల్ థింకింగ్ ను అందరూ మెచ్చుకోవాల్సింది. అసలే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వచ్చింది. అంటే వీకెండ్ రెండు రోజులు మాత్రమే ఉంటుంది.
ఈ సినిమా కంటే ముందుగా వచ్చే గోట్, 35 సినిమాలకు మంచి టాక్ వస్తే ఈ సినిమాకు ప్రాబ్లమ్ అవుతుంది. పోనీ సుహాస్ సినిమాకు డే1 మంచి ఓపెనింగ్స్ వస్తాయా అంటే లేదు. టాక్ బావుంటే థియేటర్లకు రప్పించగలడు కానీ ఇంకా ఓపెనర్ గా మారలేదు. దానికి తోడు వినాయక చవితి మూడ్ లో ఆడియన్స్ ఏ సినిమాను చూస్తారో చెప్పలేం. పైగా ప్రీమియర్ షో నుంచి వచ్చే టాక్ ఏదైనా తేడా కొడితే ఇక అంతే సంగతులు. కాబట్టి ఎలా చూసుకున్నా జనక అయితే గనక టీమ్ రిలీజ్ వాయిదా విషయంలో తీసుకున్న డెసిషన్ మంచిదే. కాకపోతే రిలీజ్ ను మళ్లీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా వెంటనే రిలీజ్ చేసుకుంటే బెటర్.