అది నిరూపిస్తే బీఆర్ఎస్ కే ప్రచారం : జానారెడ్డి
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకుంటానని అసెంబ్లీలో తాను ఏనాడూ అనలేదని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. తాను అలా అన్నట్లు సీఎం కేసీఆర్ నిరూపిస్తే తమ అభ్యర్థి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడమే కాకుండా బీఆర్‌ఎఎస్ అభ్యర్థికే ప్రచారం చేస్తాడని ప్రకటించారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో జానారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు అని విమర్శించారు. అసెంబ్లీలో తాను ఆ వ్యాఖ్యలు చేశానని పదేపదే చెబుతున్న కేసీఆర్, అసెంబ్లీ తన వ్యాఖ్యల రికార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని గతంలోనే తాను సీఎంను డిమాండ్ చేశానని గుర్తు చేశారు.
Tags :