జగ్గూ భాయ్‌కు హాలీవుడ్ ఆఫర్?
ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన జగపతి బాబు, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. విలన్ రోల్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న జగపతి బాబు చేస్తున్న సినిమాలు ఈ మధ్య ప్రతిదీ మినిమం గ్యారెంటీ అన్నట్లుగా టాక్ తెచ్చుకుంటుంది.
తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా నటిస్తున్న జగ్గూ భాయ్ పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి జగ్గూ భాయ్ త్వరలోనే మరో మెట్టు ఎక్కబోతున్నట్లు సమాచారం. తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ హాలీవుడ్ పిలుస్తోంది. మీరేమంటారు అంటూ కామెంట్ పెట్టాడు జగ్గూ భాయ్.
జగ్గూ భాయ్ ని డీ కోడ్ చేస్తూ ఫ్యాన్స్ ఆయనకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని, ఒకవేళ అదే నిజమైతే ఆ ఆఫర్ ను వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఫ్యామిలీ హీరోగా ఎన్నో హిట్స్ అందుకుని ఒకానొక టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరోలతో పోటీ పడ్డ జగపతి బాబు హాలీవుడ్ కు వెళ్తున్నాడంటే అది టాలీవుడ్ మొత్తం గర్వించదగ్గ విషయమే.