Radha Spaces ASBL

అమెరికాకు ఇజ్రాయెల్ ఘాటూ సూచన... మా అంతర్గత వ్యవహారాల్లో

అమెరికాకు ఇజ్రాయెల్ ఘాటూ సూచన... మా అంతర్గత వ్యవహారాల్లో

ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు వెనక్కు తగ్గుతారని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యానించడం తాజాగా తీవ్ర దుమారానికి తెరలేపింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోద్దంటూ బైడెన్‌కు నెతన్యాహు కాస్త గట్టిగానే సూచించారు. తమ నిర్ణయాలే తామే తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్‌ న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం నెతన్యాహు చేసిన ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా ప్రజలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై బైడెన్‌ స్పందిస్తూ మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌లో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కరణల విషయంలో ప్రధాని రాజీకి వస్తారని ఆశిస్తున్నట్లు  తెలిపారు.  ఆయన వ్యాఖయలను తాజాగా నెతన్యాహు తిప్పికొట్టారు. తమది సార్వభౌమత్త దేశమన్నారు. ప్రజల అభీష్ట మేరకే నిర్ణయం తీసుకుంటామని, విదేశాల ఒత్తిడి ఆధారంగా కాదని స్పష్టం చేశారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :