ఐఫోన్ ప్రియులకు యాపిల్ శుభవార్త

ఐఫోన్ ప్రియులకు యాపిల్ శుభవార్త

ఐఫోన్‌ ప్రియులకు యాపిల్‌ శుభవార్త చెప్పింది. తాజాగా ఐఫోన్‌ 13 సిరీస్‌ మోడళ్లను లాంచ్‌ చేసింది. ప్రతీ ఏడాదిలానే ఈ సెప్టెంబర్‌ 14న కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్‌ ఈవెంట్‌ లో ఐఫోన్‌ 13 శ్రేణిని విడుదల చేశారు. గతేడాది వచ్చిన ఐఫోన్‌ 12 మోడల్‌తో పోల్చితే 13లో కొద్దిపాటి మార్పులు చేశారు. కెమెరా సెన్సార్‌, మెరుగైన అల్ట్రావైడ్‌ కెమెరాల్ని అమర్చారు. కొత్త సిరీస్‌ లాంచ్‌ తరువాత పాత మోడళ్లైన యాపిల్‌ ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12 ఫోన్‌ ధరల్ని తగ్గించడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 17  నుంచి ముందస్తు బుకింగ్‌లు. 24 నుంచి అందుబాటులోకి వస్తాయని యాపిల్‌ తెలిపింది.

 

Tags :