అమెరికా అధ్యక్ష బరిలో భారత సంతతి మహిళ

అమెరికా అధ్యక్ష బరిలో నిలవనున్నారు భారత సంతతికి చెందిన మహిళ నిక్కీహేలీ. రాజకీయాలతో పాటు దౌత్యపర అంశాల్లోనూ ఆమెకు మంచి అనుభవం ఉంది. గతంలో హేలీ సౌత్ కరోలినా గవర్నర్‌గా పని చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2017 నుంచి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆమె మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమె త్వరలోనే దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌కు మరో అవకాశం ఇవ్వకూడదని ఆమె స్పష్టం చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? ఆ కొత్త నాయకత్వానికి తానే నేతృత్వం వహించాలా? అనే విషయాలపై ఆలోచించాలని తెప్పారు. ప్రస్తుతం అమెరికాకు కొత్త నాయకత్వం అవసరం అనేది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.