ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోన్న ‘ఆయ్’ కు విషెష్ చెప్పిన అల్లు అర్జున్
జాతీయ అవార్డ్ గ్రహీత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ తన మద్ధతుని తెలియజేస్తుంటారు. అందులో భాగంగా మరోసారి ‘ఆయ్’ చిత్రానికి ఆయన తన మద్ధతుని తెలియజేశారు. సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించే ప్రెస్టీజియస్ నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై ఆయ్ సినిమా రూపొందింది. మ్యాడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన డైనమిక్ స్టార్ నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏస్ ప్రొడ్యూస్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్, విద్యా కొప్పినీడి మూవీని నిర్మించారు.
ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాస్, అతని సోదరి విద్యా కొప్పినీడికి అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సందర్భంగా తన శుభాకాంక్షలను అందజేశారు. ఈ సందర్భంగా..‘నాకెంతో సన్నిహితుడైన బన్నీ వాస్, సోదరి విద్యా కొప్పినీడికి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వీరు మా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో భాగమయ్యారు. నా మనసుకెంతో దగ్గరైన వీరికి ‘ఆయ్’ సినిమా మంచి సక్సెస్‌ను అందిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.
టాలీవుడ్ అద్భుతమైన ఆదరణ ఉన్న ఐకాన్ స్టార్ నుంచి తిరుగులేని మద్ధతు లభించటంతో ఆయ్ చిత్ర యూనిట్‌కు మంచి ఎనర్జీనిచ్చింది. ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీతో నార్నే నితిన్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. గోదావరికి చెందిన పల్లెలో ఉండే స్నేహితుల చుట్టూ తిరిగే కథతో ఆయ్ సినిమాను తెరకెక్కించారు.
ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయ్ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు.