హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం... నిబంధనలు ఉల్లంఘిస్తే
ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాయని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీవీ ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్లుగా డీజేలతో పెద్దయెత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఈసారి శృతిమించి జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని సీవీ ఆనంద్ అన్నారు. నిబంధలు ఉల్లంఘిస్తే ఇక నుంచి చర్యలు తీసుకుంటామన్నారు.