ఉద్యోగులకు హెచ్‌పీ షాక్...

ఉద్యోగులకు హెచ్‌పీ షాక్...

ప్రముఖ కంపెనీ హెచ్‌పీ ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. 2025 నాటికి 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు హెచ్‌పీ ప్రకటించింది. పర్సనల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకు డిమాండ్‌ తగ్గడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుపోయాయి. కరోనా నుంచి కోలుకున్న తరువాత పరిస్థితి మారిపోయింది. వీటి కొనుగోలు భారీగా తగ్గాయి. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని హెచ్‌పీ నిర్ణయించింది.  ఈ పరిస్థితి 2023లోనూ కొనసాగుతుందని హెచ్‌పీ అంచనా వేస్తోంది.  ప్రస్తుతం 50 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 12  శాతం లేదంటే 4-6 వేల మందిని తగ్గించుకోవాలని భావిస్తోంది.

 

Tags :