టిక్కెట్ల విషయం మాట్లాడదలుచుకోలేదు : నాచురల్ స్టార్ నాని

టిక్కెట్ల విషయం మాట్లాడదలుచుకోలేదు : నాచురల్ స్టార్ నాని

నిత్యా మీనన్ నటించి నిర్మిస్తున్న స్కైలాబ్, సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. నిన్నటి రోజున ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. నాని చీఫ్ గెస్ట్ గా  వచ్చాడు. సత్యదేవ్ సినిమా తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.  ఇది వరకు  ఓ సారి థియేటర్ల విషయం లో కాంట్రవర్సీ ని ఎందుకొన్న విషయం తెలిసిందే! థియేటర్ల సమస్య, టికెట్ల రేట్ల వివాదాలపై మొదటిసారిగా నాని స్పందించాడు. అయితే ఆ సమయంలో నాని ఒక్కడే ముందుకు వచ్చి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంత మాట్లాడిన నాని చివరకు తన టక్ జగదీష్ సినిమాను ఓటీటీకే అమ్ముకున్నాడు. ఆ విషయంలోనూ నాని మీద ట్రోలింగ్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు నానిని ఓ రేంజ్‌లో తిట్టేశారు. అయితే ఇప్పుడు మళ్లీ నాని.. అలాంటి కామెంట్లే చేశాడు.

సత్యదేవ్ హీరోగా రాబోతోన్న స్కైలాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఫంక్షన్‌లో టికెట్ల రేట్లు, థియేుటర్ల సమస్య గురించి నేనేమీ మాట్లాడను భయపడకు సత్యదేవ్.. ఇక పెద్దవాళ్లు మాట్లాడాలి అని ఓ మాట వదిలేశాడు. దీంతో నాని ఈ విషయాన్ని ప్రస్థావించినట్టు అయింది. పెద్ద వాళ్లు ఇంకా నోరు విప్పడం లేదని ప్రశ్నించినట్టు కూడా ఉంది. మొత్తానికి నాని మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్నాయి. మరి నాని వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

 

Tags :