పాపులర్ టాలీవుడ్ సింగర్స్ హేమ చంద్ర - శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారా?

పాపులర్ టాలీవుడ్ సింగర్స్ హేమ చంద్ర - శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారా?

టాలీవుడ్‌లో మరో జంట విడాకులు తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారెవరంటే... పాపులర్ సింగర్స్.. హేమచంద్ర- శ్రావణ భార్గవి. పెళ్లి తర్వాత హేమచంద్ర - శ్రావణ భార్గవి తమ టీం తో కలిసి పలు మ్యూజికల్ ఈవెంట్స్ చేశారు. అయితే, ఇటీవల గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. దాంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్ సమంత - నాగ చైతన్య  విడాకులు తీసుకుంటున్న విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

అంతకు ముందు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కూడా ఇలాగే విడాకులు తీసుకున్నారు. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో టాలీవుడ్‌లో మరో జంట కూడా విడాకులకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి.  వీరిది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్. 2013లో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. హేమచంద్ర సింగర్‌గా ..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అందరికీ సుపరిచితుడే. అలాగే, శ్రావణ భార్గవి పలు సూపర్ హిట్స్ సాంగ్స్ పాడింది. దాంతో ఇది నిజమే అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. శ్రావణి భార్గవి తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింట్లో కామెంట్స్ సెక్షన్‌ను బ్లాక్ చేసింది. పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె రియాక్ట్ కావాలనుకోవటం లేదంటే.. ఏదో జరిగిందనే నెటిజన్స్ భావిస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడిస్తారో ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అటు హేమచంద్ర గానీ, ఇటు శ్రావణ భార్గవి స్పందించే వరకూ ఆగాల్సిందే!

 

Tags :