ASBL Koncept Ambience
facebook whatsapp X

మమ్మల్ని డీల్‌ చేయడం కాదు .. ఆయన్ను దించేయకుండా జాగ్రత్త

మమ్మల్ని డీల్‌ చేయడం కాదు .. ఆయన్ను దించేయకుండా జాగ్రత్త

మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని, అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి వ్యాపారానికి వ్యతిరేకమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ పేరిట కమీషన్లు, పేదల ఇళ్లను కూల్చడం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. మల్లన్న సాగర్‌ నిర్వాసిత కాలనీ రాజమౌళి సినిమాను తలపిస్తోందటూ ఎద్దేవా చేశారు. మూసీ బాధితులకు మల్లన్న సాగర్‌కు మించిన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  మూసీ బాధితులకు గచ్చిబౌలి భూముల్లో ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. హైదరాబాద్‌ నుంచి వాడపల్లి వరకు పాదయాత్ర చేద్దాం. సీఎం రేవంత్‌ రెడ్డి సెక్యూరిటీ లేకుండా పాదయాత్రకు రావాలి. మమ్మల్ని డీల్‌ చేయడం కాదు. రేవంత్‌ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలి. పక్కనున్న వాళ్లే ఆయన్ను దించేయకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా 6 మంత్రి పదవులు నింపుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌కు  100 సీట్లు రావడం ఖాయం అని అన్నారు. 
 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :