ASBL Koncept Ambience
facebook whatsapp X

'స్వయంభూ' నుంచి వారియర్ గా సంయుక్త ఫస్ట్ లుక్ రిలీజ్

'స్వయంభూ' నుంచి వారియర్ గా సంయుక్త ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ'. ట్యాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్  20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్ గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హై బడ్జెట్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ కాన్వాస్‌పై పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్‌లు గా నటిస్తున్నారు.

ఈ రోజు సంయుక్త బర్త్ డే. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె  ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో విల్లు, బాణాలు పట్టుకుని వారియర్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది.  

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాకరన్ ప్రొడక్షన్ డిజైనర్.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :