బంప‌రాఫ‌ర్ కొట్టేసిన హ‌ను రాఘ‌వ‌పూడి

బంప‌రాఫ‌ర్ కొట్టేసిన హ‌ను రాఘ‌వ‌పూడి

గ‌తేడాది సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి అందాల రాక్ష‌సి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నాడు. మ‌ధ్య‌లో నార్మ‌ల్ సినిమాలు చేసినా, సీతారామంతో త‌న‌లోని టాలెంట్ ను బ‌య‌ట‌పెట్టాడు. ఇండ‌య‌న్ సినిమాల్లో మోస్ట్ క్లాసిక్ మూవీస్ లిస్ట్ లోకి సీతారామం ను చేర్చి తానేంటో నిరూపించుకున్నాడు. ప్ర‌స్తుతం హ‌ను తన త‌ర్వాతి సినిమా కోసం రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీతో సినిమా చేస్తాన‌ని క్లారిటీ ఇచ్చాడు హ‌ను. ఈ సినిమాను సూర్య‌, రామ్ చ‌ర‌ణ్, కార్తిల‌లో ఎవ‌రో ఒక‌రితో చేయాల‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు కూడా చెప్పాడు. వీరిలో ఎవ‌రి డేట్స్ ఖాళీగా లేక‌పోవ‌డంతో ప్ర‌భాస్త ఈ క‌థ‌ను పాన్ ఇండియ‌న్ హీరో, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు చెప్పి గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకున్న‌ట్లు స‌మాచారం. సీతారామం సినిమా చూసి, హ‌ను మేకింగ్ కు ఫ్యాన్ అయిన ప్ర‌భాస్, ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి వెంట‌నే ఒప్పుకున్న‌ట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌భాస్ తో ఓ మూవీ కోసం అగ్రిమెంట్ చేసుకుంది. ఈ నేప‌థ్యంలో హ‌ను- ప్ర‌భాస్ కాంబోలో రాబోయే సినిమాను మైత్రీ నిర్మాత‌లే నిర్మించ‌డానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ త్వ‌ర‌లోనే రానుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న సినిమాలు పూర్త‌య్యాక స్పిరిట్ తో పాటూ ఈ సినిమాను కూడా స‌మాంత‌రంగా సెట్స్ పైకి తీసుకెళ్లే యోచ‌నలో మేక‌ర్స్ ఉన్నార‌ట‌. ఏదేమైనా ఇప్ప‌టివ‌ర‌కు మ‌ధ్య త‌ర‌గ‌తి హీరోల‌తో సినిమాలు చేసిన హ‌ను ఒక్క‌సారిగా పాన్ ఇండియ‌న్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చిందంటే బంపరాఫ‌ర్ అనే చెప్పాలి.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :