కాన్సర్ ని జయించి మళ్ళీ సెట్స్ పైకి వచ్చిన హీరోయిన్...

కాన్సర్ ని జయించి మళ్ళీ సెట్స్ పైకి వచ్చిన హీరోయిన్...

టాలీవుడ్ లో నటించి, మంచి గుర్తింపు పొందిన చాలా మంది హీరోయిన్లు ఈమధ్య కాన్సర్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులని పలు సినిమాలతో ఆకట్టుకున్న మనీష కొయిరాలా, తమ్ముడు సినిమా ఫేమ్ లిసారే, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, మహిమా చౌదరి వంటి హీరోయిన్లు కాన్సర్ బారిన పడ్డవాళ్లే. సక్సెఫుల్ గా కాన్సర్ ని జయించి తిరిగి తమ కెరీర్లో కంటిన్యూ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ తరహాలోనే బ్రెస్ట్ కాన్సర్ బారిన పడ్డానంటూ ప్రముఖ హీరోయిన్ హంస నందిని కొన్ని నెలల క్రితం ప్రకటించి షాక్ ఇచ్చింది. వంశీ దర్శకత్వం వహించిన 'అనుమానాస్పదం' చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిర్చి సినిమాతో స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారిపోయింది.

కొన్ని నెలల క్రితం కాన్సర్ బారిన పడ్డానని, ప్రస్తుతం చికిత్స జరుగుతుందని ప్రకటించింది. గుండు తో ఉన్న పలు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ అమ్మడు పోస్ట్ చేసింది. ఈ కాన్సర్ వ్యాధి తనకి జన్యు పరంగా సోకిందని, తన తల్లి ఈ వ్యాధి కారణంగానే చనిపోయిందని చెప్పి అభిమానులకి షాక్ ఇచ్చింది. మొత్తానికి హంస నందిని కాన్సర్ ని జయించింది. ఈ వ్యాధి కారణంగా ఈ అమ్మడు కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది.

ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడడంతో మళ్ళీ సినిమాలవైపు దృష్టి సారించింది. మునుపటి జోష్ తో హంసానందిని ఒక సినిమా సెట్స్ లో సందడి చేసింది. ఈ వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. డిసెంబర్ 8 తన బర్త్ డే సందర్భంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ ని షేర్ చేయడమే కాకుండా, తన అప్ కింగ్ సినిమాకి సంబంధించిన స్టిల్స్, వీడియోస్ పోస్ట్ చేసింది. నేను త్వరగా కోలుకోవడానికి మీ ప్రేమే కారణం అని అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది.

 

 

Tags :