Radha Spaces ASBL

2023-24 సంవత్సరానికి పూర్తయిన హెచ్ 1బీ కోటా

2023-24 సంవత్సరానికి పూర్తయిన హెచ్ 1బీ కోటా

హెచ్‌ 1 బీ వీసాల కోటా పూర్తి అయింది. అమెరికా ఇమిగ్రేషన్‌ సేవల సమాఖ్య ఏజెన్సీ గణాంకాల ప్రకారం 2023-2024 ఆర్థిక సంవత్సరానికి పరిమితి విధించిన మేరకు 65,000 హెచ్‌ 1బీ  వీసా దరఖాస్తులకు ఈ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాగా పరిగణించే హెచ్‌1బి అమెరికన్‌ కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో, సాంకేతిక నైపుణ్యం అవసరమున్న పనుల్లో విదేశీ అభ్యర్థులను చేర్చుకునేందుకు అనుమతిస్తుంది. భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకునే ఈ కేటగిరి అభ్యర్థులపై అమెరికన్‌ సాంకేతిక కంపెనీలు ఆధారపడుతుంటాయి.

యూఎస్‌ కాంగ్రెస్‌ విధించిన పరిమితి మేర ఖరారు చేసిన 65 వేల వీసాల్లో ఉపయోగించనివాటిని వచ్చే ఆర్థిక సంత్సరానికి అర్హవైనవిగా పరిగణిస్తారు. హెచ్‌1బీ వీసాలకు ఉన్న అధిక డిమాండు దృష్ట్యా జారీ ప్రక్రియలో సంస్కరణల కోసం ఎప్పటినుంచో అభ్యర్థనలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వీసాల సంఖ్యను పంచాలని, దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు. సాంకేతికంగా, ఆవిష్కరణల పరంగా నేడు ప్రపంచస్థాయి తనకున్న ఉన్నత స్థానాన్ని అమెరికా నిలబెట్టుకోవాలంటే హెచ్‌ 1బీ వీసాల జారీ ప్రక్రియ చాలా కీలకమని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :