Radha Spaces ASBL

కష్టాలున్నా సంక్షేమం ఆపలేదు, ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంశలు

కష్టాలున్నా సంక్షేమం ఆపలేదు, ఏపీ ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంశలు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో  గవర్నర్ బిశ్వా భూషణ్ హరిచంద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ గవర్నర్ ప్రసంగం లోని కీలక అంశాలు ఒక్కసారి చూస్తే... దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది అని... సెకండ్ వేవ్ లో మ‌ర‌ణాలు ఎక్కువుగా ఉన్నాయి అని గవర్నర్ తెలిపారు. దేశంలో క‌రోనా సంక్షోభం కొన‌సాగుతోంది అని అన్నారు. కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమ ప‌థ‌కాల‌కు కొన‌సాగించాం అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నివార‌ణ‌లో ఏపీ దేశానికే ఆద‌ర్శం అన్నారు.

క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ‌లో చేర్చాం అని, ఆరోగ్యశ్రీ‌కి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో 50శాతం బెడ్లు కేటాయించామని చెప్పారు. 900 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కేంద్రాన్ని కోరాం అని తెలిపారు. అద‌నంగా కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. క‌రోనా వ‌ల్ల మ‌రోసారి ఆర్ధిక రంగంపై  తీవ్ర ప్ర‌భావం  పడింది అన్నారు. ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా 95 శాతం హామీలు పూర్తి చేశాం అని వివరించారు. న‌వ‌ర‌త్నాలు ద్వారా ల‌బ్ధిదారుల‌కే నేరుగా సాయం అందుస్తుందని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం అని అన్నారు. ఇప్పటి వరకు కోటి 80 లక్షల మంది టెస్టులు చేయగా 14 లక్షల 54 వేల మందికి పాజిటివ్‌ వచ్చింది అని అన్నారు. ప్రతిరోజూ 590 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశాం అని తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మందికి విద్యాకానుక అందించాం అని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచింది అని ఆయన వివరించారు. 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచింది అని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో 53.28 లక్షల మందికి తొలిడోసు ఇచ్చాం అని ఆయన పేర్కొన్నారు. 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది అని అన్నారు. వాలంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. 44.5ల‌క్ష‌ల మంది త‌ల్లుల‌కు జ‌గ‌న‌న్న అమ్మ ఒడి అందించామని అన్నారు. జ‌గ‌న‌న్న విద్యా కానుక ద్వారా 47 ల‌క్ష‌ల మందికి కిట్ లు అందించామని అన్నారు. రూ.1600కోట్ల‌తో 36.8ల‌క్ష‌ల మందికి జ‌గ‌న‌న్న గోరుముద్ద‌ అందించామని చెప్పారు. వ‌చ్చే ఏడాది నుంచి సీబీఎస్ విద్యా బోధ‌న‌ మొదలుపెడతామని పేర్కొన్నారు.

నాడు- నేడు ద్వారా 15వేల స్కూళ్ల‌లో మ‌ర‌మ్మ‌తులు చేస్తున్నామని అంగ‌న్ వాడీల ద్వారా పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందిస్తామని చెప్పారు. విద్యాశాఖ‌కు అన్ని ప‌థ‌కాల కింద రూ.25,714కోట్లు కేటాయింపులు జరిగాయని వివరించారు. 108,104 అంబులెన్స్ ల సంఖ్య‌ను పెంచాం అన్నారు. కొత్త మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు. ఏపీలో 95శాతం జ‌నాభాకు ఆరోగ్య‌శ్రీ వ‌ర్తిస్తుంది అన్నారు. 10,778 రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం అని వివరించారు. రైతుల‌కు 9గంట‌ల నిరంత‌ర‌ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అని తెలిపారు. అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతుల‌కు అద‌న‌పు ఆదాయం వస్తుందని అన్నారు. 9250 మొబైల్ వాహ‌నాల ద్వారా ఇంటింటికి రేష‌న్ పంపిణీ జరుగుతుంది అన్నారు.

అర్హులైన వారంద‌రికీ ఇంటి స్థ‌లాలు ఇచ్చాం ఇచ్చామని తెలిపారు. పేద‌ల‌కు రెండు ద‌శ‌ల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం అన్నారు. పెన్ష‌న్ల కింద ప్ర‌తి నెల 1వ తేదీనే రూ.1407కోట్లు సాయం చేస్తున్నామని వివరించారు. వైయ‌స్ఆర్ కాపు నేస్తం ద్వారా రూ. 419 కోట్ల సాయం చేసామని 45 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు రూ.15వేలు సాయం చేస్తున్నామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌కు పూర్తికి అధిక ప్రాధాన్యత‌ ఇస్తున్నామని అన్నారు. క‌ర్నూలు ఎయిర్ పోర్టును అందుబాటులోకి తెచ్చాం అని వివరించారు. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌కు రూ. 1049 కోట్లు కేటాయించామని చెప్పారు. స్కూళ్ల ఆధునీక‌ర‌ణ‌కు రూ.3948 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌కు రూ. 4879.30 కోట్లు కేటాయించామని తెలిపారు. అమ్మ ఒడి ప‌థ‌కానికి రూ. 13,022 కోట్లు కేటాయింపులు చేసామని వివరించారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :