శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. టీటీడీ మొబైల్ యాప్‌ను చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. జియో సహకారంతో నూతన ఈ యాప్‌ను రూపొందించారు. శ్రీవారి ధర్మన టికెట్లు, సేవలు, సవతి గృహాలను బుక్ చేసుకోవచ్చు. అలాగే తిరుమలకు సంబంధించిన సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంటుంది. తిరుమల శ్రీవారి విరాళాలు కూడా అందజేయొచ్చు. గతంలో టీటీడీకి గోవింద యాప్ ఉండగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అందుకే ఈ స్థానంలో కొత్త యాప్ తీసుకొచ్చారు. జియోతో ఒప్పందం చేసుకున్నారు. టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమచారం ఒకే చోట ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు.
Tags :