ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ...ఇకపై క్యూఆర్ స్కాన్‌ చేస్తే

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ...ఇకపై క్యూఆర్ స్కాన్‌ చేస్తే

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు గుడ్‌న్యూస్‌. పలు ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తులకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. ఇకపై ఎవరినీ అడగకుండానే కొండపై ఒకచోట నుంచి మరోక చోటకు సులువుగా చేరుకోవచ్చు. ఇందుకు సంబంధించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో టీటీడీ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలోని వివిధ కార్యాలయాలను తెలిపే క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే చాలు. టీటీడీ అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠ క్యూకాంప్లెక్స్‌, టీటీడీ లడ్డూ కౌంటర్లు, ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్‌, విజిలెన్స్‌ కార్యాలయాలు.. ఇలా కొండపై ఉన్న విభాగాల వివరాలు ప్రత్యక్షం కానున్నాయి. అలాగే, భక్తుల తాము వెళ్లాల్సిన చోటుపై క్లిక్‌ చేస్తే మ్యాప్‌ కూడా డిస్‌ప్లే అవుతుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :