జగన్‌ను కలిసిన గిరిధర్ అరమణే.. సీఎస్ పదవికోసం చర్చ..?

జగన్‌ను కలిసిన గిరిధర్ అరమణే.. సీఎస్ పదవికోసం చర్చ..?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రేసులో మరో పేరు వినిపిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమణే కూడా అ రేసులో ఉన్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాజాగా అరమణే తాడెపల్లిలోని సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ చర్చలో కేంద్ర రక్షణ శాఖకు చెందిన పలు ప్రాజెక్ట్‌లపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ రేసులో అరమణే కూడా ఉన్నారని ప్రచారం జోరందుకుంది. సీఎస్ పదవిపై కూడా వీరు చర్చించారని, అందుకోసమే గిరిధర్ అరమణే.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారని చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా రక్షణ శాఖ నుంచి అరమణేకు రిలీవ్ ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి ఏపీ సర్కార్ లేఖ రాసిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్ర సీఎస్ సమీర్ వర్మ పదవీ కాలం నవంబర్ 30 ముగియనున్న సందర్బంగా రాష్ట్ర కొత్త సీఎస్ కోసం గాలింపు మొదలైంది. ఈ క్రమంలో నూతన సీఎస్‌గా జవహర్ రెడ్డి దాదాపు ఖాయమని వార్తలు వస్తున్న సందర్బంగా జగన్‌తో గిరిధర్ అరమణే సమావేశం కావడంతో ఈ విషయంలో సరికొత్త మలుపుకు దారి తీసింది. దీంతో ఇప్పుడు ఏపీ నూతన సీఎస్ రేసులో ఇంకెవరు ఉన్నారని, చివరికి ఈ పదవి ఎవరికి దక్కుతుందని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

 

 

Tags :