ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హస్తానికి అగ్నిపరీక్ష..?

హస్తానికి అగ్నిపరీక్ష..?

మొన్న అరుణాచల్ ప్రదేశ్ విజయం.. పెద్దగా ఎవరూ ఫోకస్ పెట్టలేదు. నిన్న కర్నాటకలో విజయంతో హస్తం గ్రాఫ్ పెరిగింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ కమలాన్ని మట్టికరిపించవచ్చన్న ధీమా పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్స్ లా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి. వీటిలో గెలిస్తే .. అత్యంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికలను ఫేస్ చేయవచ్చు. దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘర్, తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకంగా మారనున్నాయి.

బలమైన కేడర్ ఉంది. శక్తిమంతమైన లీడర్లు ఉన్నారు. అయితే లీడర్లలో అనైక్యత కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. రాజస్థాన్, చత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేరుగా తలపడుతున్నాయి. ఇందులో అధికారంలో ఉన్న రాజస్థాన్, చత్తీస్ ఘర్ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాల్సి ఉంది. ఇక మధ్యప్రదేశ్ లో అత్యధిక స్థానాలు సాధించినా.. ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడంతో.. ఆ ఛాన్స్ బీజేపీ తన్నుకుపోయింది. మరోసారి అలాంటి ఫలితాలు రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజస్తాన్ రాష్ట్రం విషయానికి వస్తే సీఎం గెహ్లోత్, సచిన పైలట్ మధ్య విభేదాలను అత్యంత వేగంగా పరిష్కరించాల్సి ఉంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే కేడర్ నలిగిపోతోంది. చత్తీస్ ఘర్ లో సీఎం భీపేశ్ భఘేల్, మంత్రి టీఎస్ సింగ్ దేవ్ కు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ తనకు అప్పచెప్పిన పనిని చేసుకు వెళ్తున్నా.. ఇప్పటికీ సీనియర్లు, రేవంత్ ను బయటివ్యక్తిగానే పరిగణిస్తున్నారు. లీడర్ల మధ్య అనైక్యత ఎలాంటి ఫలితాలనిస్తుందో.. ఇప్పటికే హస్తం పార్టీ  పలుమార్లు చవిచూసింది.

కర్నాటక ఘట్టం ముగియడంతో నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. ఆయారాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సంబంధిత రాష్ట్రాల నేతలతో చర్చించనున్నారు. నేతలందరూ కలిసికట్టుగా పనిచేస్తే కర్నాటక తరహా ఫలితాన్ని పునరావృతం చేయవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో వినూత్న వ్యూహంతో ముందుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :