ASBL NSL Infratech
facebook whatsapp X

బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య ఇకలేరు

బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్య ఇకలేరు

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య(80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్‌ సలీం వెల్లడిరచారు. భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, కుమారుడు సుచేతన్‌ ఉన్నారు. సీపీఎంలో నిర్ణయాధికార విభాగం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

బుద్ధదేవ్‌ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్‌ పూర్వ విద్యార్థి. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977లో తొలిసారి కాశిపుర్‌ బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంచలంచెలుగా తన వృత్తి జీవితంలో ఎదిగిన బుద్దదేవ్‌ జ్యోతి బసు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2001, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయ తీరాలకు చేర్చారు. ఆయన అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. బాలీగంజ్‌లోని చిన్న ఇంట్లోనే నివసించేవారు. సీఎంగానూ అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు. ఇప్పుడు అక్కడే తుదిశ్వాస విడిచారు. 
 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :