MKOne TeluguTimes-Youtube-Channel

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాని న్యాయమూర్తికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థ ప్రసాదాలు, 2023 టీటీడీ క్యాలెండర్‌, డైరీని ఈఓ అందజేశారు.

 

Tags :