Radha Spaces ASBL

రియల్ ఎస్టేట్ లో మూడు రెట్లు పెరిగిన విదేశీ పెట్టుబడులు

రియల్ ఎస్టేట్ లో మూడు రెట్లు పెరిగిన విదేశీ పెట్టుబడులు

భారత రియల్‌ ఎస్టేట్‌ రంగం విదేశీ ఇన్వెస్టర్లకు కల్పవృక్షంగా మారింది. 2017-21 సంవత్సరాల మధ్య రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి 23.9 బిలియన్‌ డాలర్ల మేర (రూ.1.79 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదు సంవత్సరాలతో పోలిస్తే మూడు రెట్లు పెరిగిందని, అమెరికా, కెనడా నుంచి వచ్చిన పెట్టుబడులే ఇందులో 60 శాతంగా ఉన్నాయని ఓ నివేదిక తెలియజేస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అధారిటీ (రెరా) తీసుకురావడంతో భారత రియల్‌ ఎస్టేట్‌పై నమ్మకం పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు ముఖ్యంగా అమెరికాలోని పలువురు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడు లను భారతీయ రియల్‌ ఎస్టేట్‌రంగంలో పెట్టినట్లు తెలుస్తోంది. ‘భారత రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులు’ పేరుతో కొలియర్స్‌-ఫిక్కీ నివేదికను వెలువరించింది. 2016లో నియంత్రణ పరమైన సంస్కరణలను (రెరా) చేపట్టడంతో భారత రియల్టీ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూలత ఏర్పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కొలియర్స్‌ తెలిపింది. ‘‘పారదర్శకత లేమి వల్ల విదేశీ ఇన్వెస్టర్లు గతంలో భారత రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉండేవారు. 2017 నుంచి ఎంతో ఆశావహంతో పెట్టుబడులు పెట్టడం మొదలైంది’’ అని కొలియర్స్‌ వివరించింది. 2017-21 కాలంలో భారత రియల్టీలోకి 23.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2012-16 మధ్య వచ్చిన పెట్టుబడులు 7.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 2012-21 మధ్యలో భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలోకి మొత్తం పెట్టుబడులు 49.4 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఇందులో విదేశీ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మొత్తం 64 శాతంగా ఉంది. 2017-21 మధ్య విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 82 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు ఐదేళ్ల కాలంలో 37 శాతంగా ఉంది.

రియల్‌ ఎస్టేట్‌లో విభాగాల వారీగా పరిశీలిస్తే.. 2017-21 మధ్య మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఆఫీస్‌ స్పేస్‌ వాటా 43 శాతంగా ఉంది. మిశ్రమ వినియోగ రంగం రెండో స్థానంలో, ఇండస్ట్రియల్‌, లాజిస్టిక్స్‌ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫీసు ప్రాజెక్టుల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2017-21 మధ్య ఏటా 2 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉన్నాయి. గృహ రంగం పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. నివాస ఆస్తుల వాటా మొత్తం విదేశీ ఇన్వెస్టర్ల ప్రాపర్టీ పెట్టుబడుల్లో 2017-21 మధ్య 11 శాతానికి తగ్గింది. డేటా స్థానికంగానే నిల్వ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు, డేటా సెంటర్లకు మౌలిక రంగం హోదా తాజాగా కల్పించడం దేశంలో నూతన డేటా సెంటర్ల బూమ్‌కు దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌కు మంచి గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఆ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు.

రియల్‌రంగంపై ఎన్నారైల చూపు

విదేశాల్లో ఉన్న ముఖ్యంగా అమెరికా, గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఎన్నారైలు భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌లోని అన్ని విభాగాల్లోనూ ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం ఈ మధ్య బాగా పెరిగినట్లు  వర్గాలు తెలిపాయి. మధ్యస్థాయి, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో వారు పెట్టుబడులకు మందుకు వస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఎన్నో సవాళ్లను విసురుతున్నాయి.కానీ, వృద్ధి పరంగా భారత్‌ మార్కెట్‌ సురక్షితమైనది’’అని రియల్‌ ఎస్టేట్‌ సంఘం నరెడ్కో వైస్‌ చైర్మన్‌, హిరనందాని గ్రూపు ఎండీ అయిన నిరజంన్‌ హిరనందాని తెలిపారు. 2022లో ఇప్పటి వరకు రూపాయి డాలర్‌తో 5.2 శాతం విలువను కోల్పోయింది. సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా ఎన్‌ఆర్‌ఐలకు భారత్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ సంపద వృద్ధికి మంచి మార్గంగా ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ కల్లోల పరిస్థితుల్లో పెట్టుబడుల పరంగా భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ సురక్షితమైనదే కాకుండా, పెట్టుబడుల వృద్ధికి, చక్కని అద్దె ఆదాయానికి వీలు కల్పిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు పెట్టుబడుల ప్రక్రియ డిజిటైజేషన్‌ కావడం వారికి అనుకూలిస్తున్నట్టు పేర్కొన్నాయి. 

కొన్ని నెలలుగా రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడుల అవకాశాలపై ఎఆర్‌ఐల నుంచి విచారణలు పెరిగినట్టు మార్కెట్‌ వర్గాలు వెల్లడిరచాయి. ముఖ్యంగా పెద్ద సంస్థలు, సకాలంలో డెలివరీ చేసే ట్రాక్‌ రికార్డు ఉన్న వాటికి ఎక్కువ విచారణలు వస్తున్నాయని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :