తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధ బిక్షవుల పర్యటన

తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధ బిక్షవుల పర్యటన

భారతదేశంలో బౌద్ధ మత స్థలాలను సందర్శించడానికి 24 మంది సభ్యుల భూటాన్‌ బౌద్ధ బృందం పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా విమానాశ్రానికి చేరుకుంది. వీరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నాగార్జున కొండ, తెలంగాణలోని బుద్ధవనం, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సాన్కిస్సా వంటి బౌద్ద క్షేత్రాలను సందర్శిస్తారు. హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌ ప్రాంగణాన్ని కూడా సందర్శించి ఢిల్లీలో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. ఎనిమిది రోజుల పాటు భారత్‌లో వీరి పర్యటన ఉంటుంది. బుద్ధుని అడుగు జాడల్లో నడవడం బౌద్ద సంఘం సభ్యుల కర్తవ్యమని భూటాన్‌ కేంద్రీయ బౌద్ధ మఠం కార్యదర్శి ఉగెన్‌ నంగ్యాల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

Tags :