ఎలాన్ మస్క్ కీలక ప్రకటన.. భారత్ కు వస్తాం

భారత్‌లో టెస్లా కార్ల ప్లాంట్‌ను నెలకొల్పే విషయంలో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా భారత్‌కు వస్తామన్నారు. ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై ఈ ఏడాది చివరిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం లోకేషన్ ఖరారు పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో మీడియాతో మాట్లాడుతూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్లాంట్ నెలకొల్పే విషయంలో ఇప్పటికే టెస్లా ప్రతినిధులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేయాలని టెస్లా ఆసక్తితో ఉందని ఇటీవల కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
Tags :