ASBL Koncept Ambience
facebook whatsapp X

దృశ్యం డైరెక్ట‌ర్ తో నాని మూవీ?

దృశ్యం డైరెక్ట‌ర్ తో నాని మూవీ?

రీసెంట్‌గా ద‌స‌రాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న నాని, ఇప్పుడు శౌర్యువ్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. డిసెంబ‌ర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేసుకున్నారు.

ఈ సినిమా త‌ర్వాత నాని ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆస‌క్తి ఇప్పుడు అంద‌రిలోనూ ఉంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం, నాని త‌న త‌ర్వాతి సినిమా దృశ్యం డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ తో చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా దీనికి సంబంధించిన డిస్క‌ష‌న్ కూడా జ‌రిగింద‌ని, కానీ ఇంకా ఆ డిస్క‌ష‌న్ ఓ కొలిక్కి రాలేద‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ తో రామ్ అనే రెండు పార్ట్ ల భారీ సినిమా చేస్తున్న జీతూ, దీన్ని కూడా థ్రిల్ల‌ర్ గానే తెర‌కెక్కిస్తున్నాడు. ఈ కాంబోలో రూపొందిన ట్వెల్త్ మ్యాన్ ఆశించిన ఫ‌లితం అందుకోక‌పోవ‌డంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు జీతూ. అయితే నానికి జీతూ చెప్పిన క‌థ త‌న గ‌త చిత్రం కూమ‌న్ రీమేక్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది.

గ‌తేడాది న‌వంబ‌ర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి స‌క్సెస్ ద‌క్కించుకుంది. పోలీస్ స్టేష‌న్ నేప‌థ్యంలో మంచి క్రైమ్ స‌స్పెన్స్ గా కూమ‌న్ పేరు తెచ్చుకుంది. జీతూ ఈ క‌థ‌నే నానికి చెప్పాడ‌ని టాక్. మ‌రి ఇందులో ఏ మేర నిజ‌ముందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :