ASBL Koncept Ambience
facebook whatsapp X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అఖండ విజయం....

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అఖండ విజయం....

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయభేరీ మోగించారు. సర్వేల అంచనాలను తలకిందులు చేసి, సూపర్ విక్టరీ సాధించారు. తన విజయం ఖాయమైన తర్వాత ట్రంప్... అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నామని ట్రంప్‌ అన్నారు. నా జీవితంలో ఇలాంటి క్షణం ఎప్పుడూ చూడలేదని, అమెరికా ప్రజల కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. అమెరికాకు పూర్వ వైభవం తీసుకువస్తాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని స్పష్టం చేశారు ట్రంప్. తన గెలుపుతో అమెరికాకు మేలు జరుగుతోందని చెప్పారు ట్రంప్.

అమెరికా 47 అధ్యక్షుడిగా ట్రంప్...

అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. 79 ఏళ్ల ట్రంప్‌... అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం రెండోసారి. ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లోని ఫ్రెడ్ ట్రంప్ , మేరీ అన్నే మాక్లియోడ్ ట్రంప్‌లకు దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. ట్రంప్ 1968లో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అందుకున్నారు. తొలుత వ్యాపారవేత్తగా రాణించిన ట్రంప్‌ రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ గెలిచారు. ఇప్పుడు కూడా డెమోక్రటిక్‌ పార్టీ మహిళా అభ్యర్ధి కమలహారిస్‌పై గెలుపొందారు.

రిపబ్లికన్లపై పట్టు...

2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ చేతిలో ఓడిపోయినప్పటికి ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీపై తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. పట్టుబట్టి మళ్లీ ఈసారి అదే పార్టీ నుంచి అభ్యర్ధిగా బరి లోకి దిగారు. 1885లో ట్రంప్‌ పూర్వీకులు జర్మనీ నుంచి అమెరికాకు వలస వచ్చారు . రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖుడైన తన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ స్ఫూర్తితో వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు. ఇండియాలోని ముంబై, పుణెల్లోనూ రియల్ వెంచర్లు ప్రారంభించారు ట్రంప్.

రియల్‌ ఎస్టేట్‌తో పాటు హోటళ్లు, ఎంటర్‌టైన్ మెంట్ చానళ్లు, స్పోర్ట్స్ క్లబ్‌లు, అందాల పోటీలు.. ఇలా అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు ట్రంప్. అమెరికన్ సంపన్నుల్లో ట్రంప్ ఒకరు. ఆయన సంపద 5 ట్రిలియన్ డాలర్లు. ట్రంప్‌ గ్రూప్‌తో పాటు ట్రంప్‌ ఎంటర్‌టైనమెంట్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థకు ఆయన సీఈఓగా నియమితులయ్యాడు. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్‌. ట్రంప్‌ అనేక పార్టీలు మారారు. తొలుత ఆయన రిపబ్లికన్‌ పార్టీకి మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన రిఫార్మ్‌ పార్టీకి మారారు. మూడేళ్ల తర్వాత ఆయన డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. 2001 నుంచి 2008 వరకు ఆయన డెమొక్రాట్‌గా కొనసాగారు. తర్వాత ఆయన జాన్‌ మెక్‌కెయిన్‌ను అధ్యక్ష అభ్యర్థిగా బలపరుస్తూ రిపబ్లికన్‌ పార్టీలోకి వచ్చారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :