MKOne TeluguTimes-Youtube-Channel

డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. 24 గంటల్లో ఆపేస్తా

డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. 24 గంటల్లో ఆపేస్తా

ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఉద్రికత్తలు చల్లారడం లేదు. రష్యా క్షిపణులతో విరుచుకుపడుతుండగా ఉక్రెయిన్‌ దీటుగా బదులిస్తోంది. ఈ రెండు దేశాలు యుద్దాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరినా ఫలితం లేకుండా పోయింది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్దాన్ని 24 గంటల్లోనే ఆపేవాడినని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా తాను అధ్యక్షుడినైతే చర్చల ద్వారా  ఈ భయానక యుద్దాన్ని 24 గంటల్లో ఆపేలా చేస్తానని పేర్కొన్నారు.

 

 

Tags :