MKOne TeluguTimes-Youtube-Channel

రెండేళ్ల నిషేదం అనంతరం ట్రంప్ ఫేస్‌బుక్‌ ఖాతా పునరుద్ధరణ

రెండేళ్ల నిషేదం అనంతరం ట్రంప్ ఫేస్‌బుక్‌ ఖాతా పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత ఖాతాను రెండేళ్ల నిషేధం అనతరం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా పునరుద్ధరించింది. ఎవరైనా సరే నిబంధనలను తరచు ఉల్లంఘించకుండా సరికొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. తమ రాజకీయ నాయకులు ఏం  చెబుతారో వినాలని ప్రజలు భావిస్తున్నారు. అది మంచి కావొచ్చు. చెడూ కావొచ్చు. అయితే అది వాస్తవ ప్రపంచానికి ఏదైనా హాని కలిగించే అంశమైతే మెటా కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. భవిష్యత్‌లో కనుక హింసాత్మక అంశాలతో కూడిన కంటెంట్‌ను ట్రంప్‌ పోస్టు చేస్తే దానిని  తొలగిస్తాం. తీవ్రతను బట్టి నెల నుంచి రెండేళ్ల పాటు ఖాతాపై మళ్లీ నిషేదం కూడా విధిస్తామని మెటా వైస్‌ ప్రెసిడెంట్‌ నిక్‌ క్లెగ్‌ స్పష్టం చేశారు.

 

 

Tags :