మళ్లీ అధ్యక్ష బరిలోకి డొనాల్డ్ ట్రంప్

మళ్లీ అధ్యక్ష బరిలోకి డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (76) సిద్ధమవుతున్నారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన ఫ్లోరిడాలోని తన మార్‌ ఏ లాగో ఎస్టేట్‌లో ప్రకటించారు. ఈ సన్నాహాల్లో భాగంగా ఆయన ప్రస్తుత అద్యక్షుడు జో బైడెన్‌ అవలంబిస్తున్న దేశీయ, విదేశాంగ విధానాలపై మరోసారి  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విధానాలతో బైడెన్‌ అమెరికాను విఫల దేశంగా మార్చారని దుయ్యబట్టారు.

 

Tags :