Radha Spaces ASBL

న్యూయార్క్ అసెంబ్లీ చట్టం... దీపావళికి!

న్యూయార్క్ అసెంబ్లీ చట్టం... దీపావళికి!

దీపావళి పర్వదినంతో పాటు చాంద్రమాన కొత్త సంవత్సరం రోజున న్యూయార్క్‌లో సెలవు ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా చట్టసభ సభ్యులు, ప్రవాస సభ్యుల  చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించనుంది. ఆ రెండు రోజులను సెలువులుగా ప్రకటించేందుకు చట్టాన్ని రూపొందించాలని న్యూయార్క్‌ అసెంబ్లీ భావిస్తోంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రజల విభిన్న సంస్కృతిని గుర్తించాల్సిన అవసరం ఉందని, దీపావళి, చాంద్రమాన కొత్త సంవత్సరం రోజును సెలవు దినాలుగా ప్రకటించేందుకు గాను అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చట్టాన్ని ఆమోదిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ కార్ల్‌ హేస్టీ తెలిపారు. పాఠశాల క్యాలెండరులో అమలు చేసే విషయమై చర్చలు కొనసాగిస్తామని వివరించారు. సెలవుల కోసం ప్రతిపాదించిన బిల్లుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసే (జూన్‌ 8) లోపు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :