Radha Spaces ASBL

'ఖుషీ'గా హ్యాపీ గా షూటింగ్ జరుగబోతోంది : అప్‌డేట్స్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ  

'ఖుషీ'గా హ్యాపీ గా షూటింగ్ జరుగబోతోంది : అప్‌డేట్స్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ  

నేచురల్ స్టార్ నానితో ‘నిన్ను కోరి’, అక్కినేని నాగ చైతన్యతో ‘మజిలీ’ వంటి సెన్సిబుల్ స్టోరీస్ తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ . ఆయన దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ . రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత  జంటగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ శివ నిర్వాణ కీలక అప్‌డేట్ ప్రకటించారు.  రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. కానీ ఇంతలోనే సమంత అరుదైన ఆటో ఇమ్యూ్న్ డిసీజ్ బారిన పడటంతో షూటింగ్‌‌కు బ్రేక్ పడింది. అయితే సమంత ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకుంది. ఆమె బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంటోంది. కానీ ‘ఖుషి’ మూవీ గురించి అప్‌డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక గుడ్ న్యూస్ షేర్ చేశారు డైరెక్టర్ శివ. సమంత, విజయ్ జంటగా తెరకెక్కుతున్న ‘ఖుషి’ రెగ్యులర్ షూటింగ్‌ త్వరలో ప్రారంభం అవుతుందని ట్వీట్ చేశారు. అంతేకాదు అంతా బ్యూటిఫుల్‌గా సాగుతుందని పోస్టులో పేర్కొన్నారు.

ఒక దశలో ఈ మూవీ గురించి నెట్టింట అనేక రూమర్స్ వ్యాపించాయి. ఈ స్టోరీలో తన పాత్రకు సంబంధించి మార్పులు చేయకపోతే డేట్స్ ఇవ్వనని సమంత డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా పోస్టుతో డైరెక్టర్ శివ వాటన్నింటికీ చెక్ పెట్టగా.. ప్రస్తుతం విజయ్, సమంత ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడ్కర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికొస్తే.. ఇటీవలే ‘జెర్సీ’ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. 

https://twitter.com/ShivaNirvana/status/1619952053790597120

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :