యానిమల్ పై హైప్ పెంచుతున్న దిల్ రాజు

ఎంతో కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న దిల్ రాజు ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు డిస్ట్రిబ్యూషన్‌ను కూడా రన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే దానిలో దిల్ రాజు భాగం కచ్ఛితంగా ఉంటుంది. అలా అని ఏ సినిమాను పడితే ఆ సినిమాను కొనేయరు.
రిస్క్ అనుకున్న వాటి జోలికి అయితే అసలు వెళ్లనే వెళ్లరు. ఇప్పుడు దిల్ రాజు ఒక హిందీ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో యానిమల్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తోడు సినిమాకు హైప్ కూడా బాగా ఉంది. అందుకే ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా హక్కులను కొన్నాడంటే సినిమాను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదేమైనా యానిమల్ రైట్స్ ను కొని దిల్ రాజు ఆ సినిమా హైప్ ను మరింత పెంచాడు.






