నాట్స్‌ సంబరాలు - వివిధ కార్యక్రమాలు

నాట్స్‌ సంబరాలు - వివిధ కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాట్స్‌) న్యూజెర్సిలో నిర్వహిస్తున్న 7వ అమెరికా తెలుగు సంబరాల్లో 2వ రోజు కార్యక్రమాలు స్వాగత నృత్యంతో ప్రారంభమయ్యాయి. రెండో రోజు జరిగిన కార్యక్రమంలో పలువురు అతిథులు, కార్యవర్గ సభ్యులు, ప్రముఖులు మాట్లాడారు. కళాకారులతో మీట్‌ అండ్‌ గ్రీట్‌, ఆధ్యాత్మిక ప్రవచనాలు, వ్యాపార అవకాశాలపై సెమినార్లు, ఫ్యాషన్‌ షో, అవసరాల శ్రీనివాస్‌ హాస్య ప్రదర్శనల్లో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఇటీవల మరణించిన ప్రముఖ సినీనటుల కటౌట్ల వద్ద పలువురు సందడి చేస్తూ ఫోటోలు దిగారు. అమెరికావ్యాప్తంగా ఉన్న పలు జాతీయ స్థాయి ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని నాట్స్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొనేందుకు హాజరయిన పలువురు ప్రముఖ సినీనటీనటులతో ప్రవాసులు ఫోటోలు దిగారు.
 

Click here for Event Gallery
 

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :