Radha Spaces ASBL

అమెరికాలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు.. భద్రాద్రిలో

అమెరికాలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు.. భద్రాద్రిలో

అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో నిర్మించనున్న సీతారాముల గుడిలో ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు భద్రాచలంలోని చిత్రకూట మండపం ఎదుట ధాన్యాధివాసం చేశారు. ఈ క్రతువును ఈవో రమాదేవి ఆరంభించారు. అట్లాంటాలో ప్రధాన అర్చకుడిగా సేవలందించనున్న పద్మనాభాచార్యులు, రామాలయం అర్చకులు పాల్గొన్నారు. మండల పూజలో భాగంగా 40 రోజులు ధాన్యంలో విగ్రహాలను ఉంచుతారు. ఆ తర్వాత అమెరికా తరలిస్తారు. ఈ విగ్రహాలకు పర్ణశాలకు సమీపంలో ఒకరోజు గోదావరిలో ఉంచి జలాధివాసం చేశారు. అట్లాంటా ప్రాంతంలో నిర్మించనున్న ఆలయంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అమలవుతున్న పాంచరాత్ర ఆగమ పూజల విధానం పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ విశ్రాంత స్థపతి రాజేశ్వరాచారి, రామాలయం ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రముఖ శిల్పి బాల సుబ్రహ్మణ్యాచారికి చెందిన విగ్రహ తయారీ కేంద్రంలో 14 అడుగుల ఎత్తు రాతి ఆలయం నిర్మించారు. ప్రతి భాగాన్ని విడదీసి, మళ్లీ జోడించేందుకు వీలుగా రూపొందించారు. విడిభాగాలను అట్లాంటాకు తీసుకెళ్లి అక్కడ ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తారు.  శిఖరాన్ని అక్కడే నిర్మించనున్నారు. శిఖరంతో కలిపి కోవెలను 36 అడుగుల ఎత్తున నిర్మిస్తారు. సీతారాములు, లక్ష్మణుడి విగ్రహాలను భద్రాచలంలో రామాలయంలోని మూర్తుల తరహాలో సిద్దం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కోటప్పకొండ వద్ద సేకరించిన నల్లని నాణ్యమైన శిలను ఇందుకు ఉపయోగించారు. రాముడి విగ్రహం ఎత్తు అయిదడుగులు కాగా, టన్ను బరువు ఉంటుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :