హైదరాబాద్ కు తలమానికం... సిగ్నేచర్ విల్లాలు

హైదరాబాద్‌లో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎన్నో ప్రాజెక్టులను చేపడుతున్నాయి. వాటిలో కొన్ని ప్రాజెక్టులు తమ ప్రత్యేకతలను చాటుతూ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. హైరైజ్ బిల్డింగ్‌లతోపాటు, విల్లాలను హైదరాబాద్‌లో కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తుంటారు. దానికితోడు ఇతర రాష్ట్రాల పెట్టుబడిదారులు, అంతర్జాతీయ కంపెనీలు అన్నీ హైదరాబాద్‌వైపే చూడటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హైదరాబాద్ ఇతర నగరాలకన్నా ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎత్తయిన టవర్లు, విలాసవంతమైన విల్లాలు ఫ్యాషన్‌గా మారడం వల్ల కాంక్రీట్ జంగిల్‌గా నిర్మాణాలు కనిపిస్తుంటాయి. దేవాన్ష్ గ్రూపు నిర్మించే విల్లాలు, ఇతర కట్టడాలు వీటికి భిన్నంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రకృతిని ఆస్వాదించేలా, చుట్టుప్రక్కల ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా నిర్మాణాలను దేవాన్ష్ గ్రూపు చేస్తుంది.
ట్రెండ్‌ని సెట్ చేస్తున్న దేవాన్ష్ గ్రూపు
నిర్మాణరంగంలో కొన్ని దశాబ్దాల అనుభవంతో జంటనగరాలలో దేవాన్ష్ గ్రూప్ ఎన్నో ప్రాజెక్టులతో కస్టమర్లకు చేరువైంది. దానికితోడు తాను చేపట్టిన ఏపనినైనా సకాలంలో, నాణ్యతతో పూర్తి చేసేందుకు కంపెనీ ప్రాధాన్యత ఇస్తుంది. కస్టమర్ల సంతృప్తిని, అభిరుచులను బట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి సక్సెస్‌ను సాధిస్తోంది. తాజాగా దేవాన్ష్ కన్‌స్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఉప్పర్‌పల్లి, అత్తాపూర్‌లో ఉన్న దేవ్స్ సిగ్నేచర్ విల్లాస్ నిస్సందేహంగా ట్రెండ్‌సెట్టర్ అని చెప్పవచ్చు. పట్టణ జీవనాన్ని మరోమెట్టుకు తీసుకువెళ్ళేలా అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో, సహజంగా ప్రకృతి రమణీయకత కనిపించేలా ఈ సిగ్నేచర్ విల్లాస్‌ను కంపెని నిర్మిస్తోంది.
నీటి సంరక్షణకు పెద్దపీట
గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు ముఖ్యమైనది నీటి వనరులు. నీటిని సంరక్షించడంతోపాటు వాటిని నిల్వచేయడం కూడా ఓ పెద్ద విషయం. ఈ ప్రాజెక్టులో భాగంగా నీటిని వృధా కానివ్వకుండా దానిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఉపయోగించుకునేలా సౌకర్యాలను ఇందులో కల్పించారు. ఇలా రీసైక్లింగ్ ద్వారా వచ్చిన నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా ఓ పెద్ద ట్యాంక్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 14 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. రెండవది, ఈ ప్రాజెక్ట్ ఎకో ఎస్‌టిపి సెటప్‌ను కలిగి ఉంది, దీని ద్వారా నీటిని శుద్ధి చేసి గార్డెనింగ్, ఫ్లష్ ట్యాంకుల కోసం ఉపయోగించేలా ఏర్పాటు చేశారు. దాదాపు 35 వేల లీటర్ల నీరు దీని ద్వారా ఉత్పత్తి అవుతుంది. గ్రాస్‌పేవ్‌డ్ రోడ్స్ ఉండటం వల్ల అవి నీటిని పీల్చుకుని భూగర్భ జలాల పెంపునకు సహకరిస్తాయి. దానికితోడు ఈ ప్రాజెక్టులో 30శాతం పైగా పచ్చికబయళ్ళ కోసం కేటాయించారు. గ్రీనరి నియమాలకన్నా ఇక్కడ ఎక్కువ గ్రీనరి ఉండేలా ఏర్పాటు చేశారు. ఐజిబిసి ప్లాటినం గుర్తింపు ఈ ప్రాజెక్టుకు మకుటాయమానంగా చెప్పవచ్చు.
సిగ్నేచర్ విల్లా ప్రాజెక్టును 8.32 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ ట్రిప్లెక్స్ విల్లాలో ప్రతి విల్లాకు డబుల్‌హైట్ బాల్కనీలు, టెర్రస్‌లు, స్కైలైట్స్‌లు ఆకట్టుకునేలా నిర్మించారు.
ఈ విల్లాను ఆధునిక సాంకేతిక నైపుణ్యం, ఆకట్టుకునేలా నిర్మాణం, ఇతరత్రా సౌకర్యాలతో నిర్మించినా, మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా అక్కడ నివసించేవాళ్ళు తాము ప్రకృతితోమమేకమై పర్యావరణంతో తమ బంధాన్ని గుర్తు చేసుకునేలా కనిపించే వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. ఇక్కడ నివసించే వాళ్ళు కిటీకిల నుంచి బయటకు చూస్తున్నప్పుడు వారికి చెట్లు, పచ్చికబయళ్ళు కనిపిస్తుండటం వల్ల వారు తాము సహజమైన ప్రకృతి నడుమ జీవిస్తున్నామనే స్పృహ వారిలో కలుగుతుంది.
సౌకర్యాలు...
రాక్‌గార్డెన్, రేడియల్ గార్డెన్, ఓపెన్ ఎయిర్ థియేటర్, కమ్యూనిటీ ప్లాజా, కమ్యూనిటీ హెర్బ్ గార్డెన్స్, పండ్లతోటలు, యోగా కోర్ట్, మెడిటేషన్ కేంద్రం, జిమ్, జాగింగ్ ట్రాక్, టెన్నిస్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్, స్కేటింగ్ పార్క్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆటస్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు క్లబ్‌హౌజ్‌లో గ్రాసరీస్టోర్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, రీడిరగ్ స్పేస్, వెయిటింగ్ స్పేస్, ఇండోర్ గేమ్స్, టిటి, క్యారమ్, చెస్, కాఫీ షాప్, జిమ్, యోగా స్పేస్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వంటివి ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న 100 అడుగుల ఫీట్ రోడ్డుకు ఈ ప్రాజెక్టు 50 అడుగుల దూరంలో ఉండటం మరో ప్లస్‌పాయింట్‌గా చెప్పవచ్చు. సహజసిద్ధమైన ప్రకృతిలో మనం విహరించినప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో అలాగే విల్లాలో నివసించేవారు కూడా బయట ఉన్న ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణాన్ని చూసి ఆనందించేలా విల్లాల నిర్మాణం జరుగుతోంది.
ఇతర వివరాలకు కంపెనీ వెబ్‌సైట్‌ను చూడండి.
http://www.devanshconstructions.com/signature-villas-attapur
DEVANSH GROUP
8-2-686/DC/8 (8A & 8B)
501,5th floor, Dev Dhanuka Prestige, Banjara Hills, Road No 12
Hyderabad, Telangana - 500034
Phone: +91 40 233 22 622
Dev Signature Villas:
+91 79978 07333, +91 99485 99900, +91 95533 07700