కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మద్యం విధానం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢల్లీి కోర్టు పొడిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయి ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉంటున్న ఈ నేతలిద్దరి కస్టడీని సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీరిని ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ జవేజా ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
Tags :