తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా దీపావళి ఆస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వేడుకగా నిర్వహించారు. అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఈ కార్యక్రమం జరిపారు. ఆలయంలో మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయ హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు.







Tags :