ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క్రెడాయ్ ప్రాపర్టీ షో.. వేలాదిమంది రాకతో సక్సెస్

క్రెడాయ్ ప్రాపర్టీ షో.. వేలాదిమంది రాకతో సక్సెస్

క్రెడాయ్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్‍ రెండవ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్‍ ఎస్టేట్‍, డెవలపర్స్ ఈ షోలో పాల్గొన్నారు. మొదటి షో కోవిడ్‍ కారణంగా దేశవ్యాప్తంగా రియల్‍ ఎస్టేట్‍ రంగం కుదుపులకు లోనైంది. ముఖ్యంగా సెకండ్‍ వేవ్‍ తర్వాత ఎక్కడా ప్రాపర్టీ షోలు భారీ స్థాయిలో జరగలేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ ఆగస్టు 13,14,15 తేదీల్లో హైదరాబాద్‍లోని హైటెక్స్లో   క్రెడాయ్‍ హైదరాబాద్‍ యూనిట్‍ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది.

కరోనా సెకండ్‍వేవ్‍తో పాటు లాక్‍డౌన్‍ వల్ల భూములు, ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్‍ల ధరలు తగ్గుతాయని, కొనుగోళ్లు జరగవని చాలామంది భావించారు. కానీ దానికి విరుద్ధంగా క్రెడాయ్‍ హైదరాబాద్‍ ప్రాపర్టీ షోకు అన్యూహంగా ఆదరణ పెరగడంతో పాటు వివిధ రకాల ప్రాపర్టీలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి ప్రదర్శించడం రియల్‍ ఎస్టేట్‍ వర్గాల్లో సంతోషం కలిగించింది. 

గతంలో ప్లాటు, అపార్ట్మెంట్‍ ఫ్లాట్‍, ఇల్లు, విల్లా, ఏదీ కొనాలన్నా ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రాజెక్టు వివరాలు తెలుసుకునేందుకే రోజుల సమయం పట్టేది. ఈ ఇక్కట్లను తప్పించేలా, అన్ని ప్రాజెక్టుల వివరాలు సమగ్రంగా తెలియజేసేందుకు ప్రముఖ రియల్‍ ఎస్టేట్‍ సంస్థలన్నీ ఒకేచోట కొలువుదీరేలా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్‍ ఉపయోగంగానే ఉందని కొందరు వినియోగదారులు పేర్కొన్నారు. దీంతోపాటు ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థలు తాము చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను నేరుగా, వీడియోల ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాయి. ఈ ప్రదర్శనలో నచ్చిన ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసే ఇంటికి వెంటనే రుణాలిచ్చేందుకు పలు బ్యాంకులు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు ప్రాపర్టీల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.

ఈ ప్రాపర్టీ షోలో పలు రియల్‍ ఎస్టేట్‍ కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాయి. తమ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం క్యూఆర్‍ కోడ్‍ స్కాన్‍ చేస్తే స్మార్ట్ ఫోన్‍లోనే అన్ని వివరాలు తెలిసేలా అవకాశం కల్పించారు. డ్రోన్‍ కెమెరాలతో తీసిన వీడియోలను ప్రదర్శిస్తున్నాయి.  అపర్ణ, మైహోం, వాసవి, సుమధుర, రాజపుష్ప, ఎస్‍ఎంఆర్‍ తదితర సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. 1500 ప్రాజెక్టులు, 100 స్టాళ్లలో అందంగా తీర్చిదిద్దారు. ప్రతి స్టాల్‍ ఏదో ప్రత్యేకతను సంతరించుకుంది.

ప్రాపర్టీ షో సక్సెస్‍: రామకృష్ణారావు

కోవిడ్‍ పరిస్థితుల్లోనూ రియల్‍ ఎస్టేట్‍ గృహ నిర్మాణ మార్కెట్‍ దూకుడు ప్రదర్శిస్తోంది. శ్రావణమాసం రావడంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఊపందుకున్నాయి. కొన్ని విభాగాల్లో అసాధారణ వృద్ధి కనిపిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, వ్యాపారసంస్థలకు ఇప్పటికీ హైదరాబాద్‍ ఆకర్షణీయ కేంద్రంగా ఉండటం కూడా రియల్‍ రంగానికి కలిసివచ్చింది. పెట్టుబడులు తదనంతరం ఉపాధి కల్పన అవకాశాలతో నగరంలో గృహ, వాణిజ్య రియల్‍ ఎస్టేట్‍ రంగంలో డిమాండ్‍ పెరగడానికి ఇది కూడా దోహదం చేస్తుందని చెప్పవచ్చు. నగరంలో ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మౌలిక ప్రాజెక్టులు, నగరం విస్తరిస్తున్న తీరు, నగరానికి వస్తున్న పెట్టుబడుల ద•ష్ట్యా మున్ముందు మరింత ఆభివ•ద్ధి చెందనుంది. ఈ ప్రాపర్టీ షోకు విపరీతంగా స్పందన రావడం సంతోషం కలిగించే విషయమని క్రెడాయ్‍ హైదరాబాద్‍ అధ్యక్షుడు రామక•ష్ణారావు తెలిపారు.

క్రెడాయ్‍ హైదరాబాద్‍ ఉపాధ్యక్షుడు కె. రాజేశ్వర్‍ మాట్లాడుతూ, కొవిడ్‍ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండటం, పిల్లలు తరగతులు ఆన్‍లైన్‍ క్లాసులు వింటుండటంతో విశాలమైన ఇళ్లకు డిమాండ్‍ పెరిగింది. ఈ ప్రాపర్టీ షోలో సామాన్యుడి నుంచి కోటీశ్వరులు కొనుక్కునేలా ఇళ్లు, ప్లాట్లు అందుబాటులో ఉండటంతో అందరికీ ఇదీ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి ప్రాపర్టీ షోలతో ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజల్లో అవగాహన కూడా పెరుగుతుంది. ప్రజలు మోసపోయే పరిస్థితి నుంచి ఇతరులకు అవగాహన కలిగించేలా క్రెడాయ్‍ హైదరాబాద్‍ ప్రాపర్టీ షోలను నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.

రియల్‍ పుంజుకుంటోంది

క్రెడాయ్‍ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్ బాగుందని క్రెడాయ్‍, హైదరాబాద్‍ యూనిట్‍ ట్రెజరర్‍ ఆదిత్య అన్నారు. కోవిడ్‍ మునుపటి స్థితికి  రియల్‍ ఎస్టేట్‍ చేరుకుంటుందనే నమ్మకం కలిగిందన్నారు.  కొత్తగా ఇళ్లలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆఫీస్‍ స్పేస్‍లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్‍లు ఉండటంతో మార్కెట్‍ ఆశాజనకంగా ఉందన్నారు.

ప్రతి ఇంటిలో సాధారణంగా చెక్క(ఉడ్‍)తో తయారుచేసిన డోర్లు కనిపిస్తాయి. వీటి స్థానంలో తాజాగా ఎలాంటి తుప్పు రాకుండా ఉండే ఐరన్‍ డోర్లు వాడుతున్నారు. కిటికీలు కూడా ఇదే తరహాలో ఏర్పాటుకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. పూర్తిగా ఐరన్‍తో తయారు చేస్తుండగా చూస్తే మాత్రం చెక్క తలుపేనన్న భావన కలుగుతుంది. ఐరన్‍పై వాడే పెయింటింగ్‍ వర్షాలకు దెబ్బతినకుండా ఉండటమే కాకుండా, విద్యుత్‍ ప్రమాదాలకు ఆస్కారం ఉండదని నిర్వాహకులు అంటున్నారు.

ప్రీకాస్ట్ టాయిలెట్లకు ఆదరణ

ప్రాపర్టీ షోలో ఓ ప్రైవేట్‍ కంపెనీకి సంబంధించిన ప్రీకాస్ట్ టాయిలెట్ల స్టాల్‍కు ఆదరణ నెలకొంటున్నది. టాయిలెట్లు సహా ఇతర నిర్మాణాలను సాధారణ నిర్మాణానికి భిన్నంగా ప్రీకాస్ట్(ముందే తయారు చేసిన ) వనరుల ద్వారా సమయం, శ్రమను ఆదా చేస్తూ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయొచ్చని నిర్వాహకులు వివరిస్తున్నారు. నిర్మాణంలో తొలిదశైన ప్రీకాస్ట్ పుట్టింగ్‍ల నుంచి బీమ్‍లు, పిల్లర్లు, స్లాబ్‍లు, ప్రధాన గోడలతోపాటు ఇంటిలోపలి పార్టిషన్‍ గోడల నిర్మాణాలకు ప్రీకాస్ట్ మెటీరియల్‍ను ఎలా వినియోగించవచ్చో పేర్కొన్నారు. 

మెమొంటోల బహుకరణ

వివిధ కెటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు స్టాల్స్ నిర్వాహకులకు  క్రెడాయ్‍ అధ్యక్షుడు రామక•ష్ణారావు, జనరల్‍ సెక్రటరీ వి. రాజశేఖర్‍రెడ్డిలు మెమొంటోలను అందజేశారు.  కాగా మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుండి 40వేలకు పైగా సందర్శకులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం లక్కీ డ్రా తీసి హైదరాబాద్‍కు చెందిన శ్రీనివాస్‍ రెడ్డి అనే వ్యక్తికి కారును అందజేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :