విశాఖలో క్రెడాయ్ సదస్సు

విశాఖలో క్రెడాయ్ సదస్సు

కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ( క్రెడాయ్‌) నాల్గో ఎడిషన్‌ న్యూ ఇండియా సమ్మిట్‌-2022ను ఈ నెల 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షులు జి.రామ్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి సవాళ్లు, టైర్‌ 2, 3 అభివృద్ధిపై జాతీయ సదస్సుల్లో చర్చిస్తామని అన్నారు. నాన్‌ మెట్రో నగరాల్లో రోడ్‌మ్యాప్‌ పైనా పలు నిర్ణయాలు చేస్తామని తెలిపారు.  దేశ వ్యాప్తంగా 500 మంది డెవలపర్లు పాల్గొనున్నారని తెలిపారు. క్రెడాయ్‌ ఏపీ అధ్యక్షుడు బి.రాజాశ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇంతవరకు మైసూర్‌, నాగపూర్‌, రాయపూర్‌లలో సదస్సులు జరిగాయని తెలిపారు. తాజాగా విశాఖలో జరగనున్న సదస్సులో బిల్డర్ల సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సహకారంపై చర్చిస్తామన్నారు.

 

 

Tags :