నిమ్మగడ్డ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అవకతవకలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి అనుకూలంగా లేని ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఒకే డోర్ నంబర్‌పై వందల బోగస్ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బోగస్ ఓట్లు తొలగించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు.







Tags :