స్కూల్ నుంచే నైపుణ్య శిక్షణ

స్కూల్ నుంచే నైపుణ్య శిక్షణ

పాఠశాలల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖను పునర్‌ వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సీడాప్‌, ఉపాధి, శిక్షణ సహా పలు విభాగాలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కిందకు తీసుకువచ్చే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటి  సమీక్ష నిర్వహించారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (డీఎస్డీఏ)ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.  వర్క్‌ ఫ్రం హోంటౌన్‌ కేంద్రాల పైలట్‌ ప్రాజెక్ట్‌పై సమీక్షలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో వర్క్‌ ఫ్రం హోంటౌన్‌ (డబ్ల్యూఎఫ్‌ హెచ్‌టీ) కేంద్రాలను భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

 

Tags :