టాలీవుడ్ లో సెకండ్ వేవ్ కరోనా కల్లోలం

టాలీవుడ్  లో  సెకండ్ వేవ్ కరోనా కల్లోలం

‘జీవితం అనేది ఒక యుద్ధం! దేవుడు మనల్ని వార్‍ జోన్‍ లో పడేశాడు’ అని మహేశ్‍ బాబు సరైన పోస్ట్ పెట్టాడు.  నిజమే! ఆయుధం లేకుండా కరొనాతో యుద్ధం చేస్తున్నాం.  దేశంలో రెండవ దశ  కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి లక్షల్లో పాజిటివ్‍ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రవేట్‍  ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్‍ దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా సోషల్‍ మీడియా ఆయన కరోనా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. ఈ మహమ్మారి నుండి విముక్తి పొందడానికి గత ఏడాది ప్రభుత్వాలు  లాక్‍ డౌన్‍  ప్రకటించాయి. రెండవ దశ కరోనా మొదటి దాని కంటే వేగంగా వ్యాప్తిచెందుతున్నా ఈసారి లాక్‍ డౌన్‍ ప్రకటించలేదు. ప్రజలే స్వయంగా జాగ్రత్తలు పాటించి లాక్‍ డౌన్‍కు దూరంగా ఉండమని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా కొన్ని ప్రభుత్వాలు పాక్షికంగా లాక్‍ డౌన్‍ ప్రకటించగా... తెలుగు రాష్ట్రాలు రాత్రి వేళ కర్ఫ్యూ విధించాయి. కర్ఫ్యూ అనుసరించి థియేటర్‍ యజమానులు స్వచ్చందంగా సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. దీంతో ఈ ఏడాది 2020 చివరి వరకు విడుదల తేదీలు  ప్రకటించిన చిన్న, పెద్ద చిత్రాలు గందరగోళ పరిస్థితుల్లో విడుదల వాయిదా వేసుకున్నాయి. అన్ని పరిస్థితులు మాములు స్థితికి వచ్చినా భారీ చిత్రాల విడుదల తేదీలు ఎప్పుడు ఉంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో నిర్మాతలు ప్రస్తుతం ఉన్నారు. మరోవైపు కొన్ని చిత్రాల షూటింగ్‍లు కూడా కరోనా సెకండ్‍వేవ్‍ కారణంగా వాయిదాపడ్డాయి.

ఈసారి కోవిడ్‍ సెకండ్‍ వేవ్‍ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై గట్టిగా పడింది. ఇప్పటికే కోవిడ్‍ వ్యాప్తి కారణంగా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దక్షిణాదిన కూడా త్వరలో ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పాన్‍ ఇండియా మూవీస్‍ గా ప్రసిద్ధి చెందిన సినిమాలు విడుదల తేదీల విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. కొందరైతే తమ చిత్రాల విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ  దావానలంలా వ్యాపిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్‍ పక్రియ వేగవంతంగా కొనసాగుతున్నప్పటికీ.  ప్రతీ రోజు లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే వైరస్‍ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. కొన్ని చోట్ల రాత్రిపూట, మరి కొన్ని ప్రాంతాల్లో వారాంతపు లాక్‍డౌన్‍ విధిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ ఈసారి సినీ పరిశ్రమపై గట్టిగానే పడింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు వైరస్‍ బారిన పడ్డారు. ఇక పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయిలో ఉండటంతో సినిమా థియేటర్లను మూసి వేయడం.. లేదా.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకుంటున్నాయి. 

‘ఆచార్య’ మేలో విడుదల కాకపోతే ఆగష్టులో వస్తుందా?

మెగాస్టార్‍ చిరంజీవి ‘ఆచార్య’ గా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇప్పటికే దాదాపు షూటింగ్‍ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ మే13 న  విడుదల విడుదల అవుంటుందని ప్రకటించారు. చిరంజీవి  ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రం తరువాత భారీగా రూపొందుతున్న  ఈ చిత్రం టాలీవుడ్‍లో ప్రస్తుతం ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్న చిత్రంగా నిలిచింది. మెగాస్టార్‍ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవికి జోడీగా కాజల్‍ అగర్వాల్‍ నటిస్తోంది.  ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మెగా పవర్‍స్టార్‍ రామ్‍ చరణ్‍ ఈ సినిమాలో సిద్ధ అని  ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‍టైన్‍మెంట్‍తో కలిసి నిరంజన్‍ రెడ్డితో కలిసి రామ్‍ చరణ్‍ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి ‘లాహే.. లాహే’ అంటూ సాగే ఓ పాటని చిత్ర యూనిట్‍ విడుదల చేశారు. హారిక నారాయణ్‍ పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సంగీతం సమకూర్చారు. 26 మిలియన్‍ వ్యూస్‍తో ఈ పాట యూట్యూబ్‍లో దూసుకు పోతుంది.   సినిమాలో రామ్‍ చరణ్‍కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఉగాది సందర్భంగా వీరిద్దరి రొమాంటిక్‍ పోస్టర్‍ని కూడా విడుదల చేశారు. వీరిద్దరి మధ్య సినిమాలో ఓ డ్యుయెట్‍ కూడా చిత్రీకరించారట కొరటాల.  నక్సల్‍ బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనుసూద్‍, జిశ్శు సేన్‍గుప్తా, తనికెళ్ల భరణి, అజయ్‍ సౌరవ్‍ లోకేష్‍, కిశోర్‍, సంగీత క్రిష్‍, మరియు రెజినా కెసెండ్రా తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‍ వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్‍ తాత్కాలికంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడితే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆగష్టు నెలలో విడుదల అవుతుందని తెలుస్తోంది.

‘అఖండ’ మే నెలలో ఉండకపోవచ్చు...

‘సింహా’, ‘లెజెండ్‍ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‍ బస్టర్‍ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలక•ష్ణ, మాస్‍ డైరెక్టర్‍ బోయపాటి శ్రీనుల మ్యాసివ్‍ బ్లాక్‍బస్టర్‍ కాంబినేషన్‍లో హ్యాట్రిక్‍ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‍ కోసం ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తెలుగు వారు చాలా ప్రత్యేకంగా భావించే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పర్వదినం రోజున గత చిత్రాల్లాగానే బాలయ్య  సినిమాకు అఖండ అనే పవర్‍ ఫుల్‍ టైటిల్‍ ఎనౌన్స్ చేసి ఆడియెన్స్కు సరికొత్త సర్‍ ప్రైజ్‍ ఇచ్చారు మేకర్స్. దీంతో పాటు మ్యాసీవ్‍ టైటిల్‍ రోర్‍ పేరుతో టీజర్‍ని విడుదల చేసింది చిత్ర యూనిట్‍.  ఈ టీజర్‍లో ఇంతవరకూ చూడని సరికొత్త లుక్‍లో బాలయ్య కనిపించడంతో పాటు టైటిల్‍ కూడా ఆయనకు యాప్ట్ అయ్యేలా ఉండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక  ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది... కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది...’  అంటూ హై వోల్టేజ్‍ తో  బాలయ్య చెప్పిన పవర్‍ ఫుల్‍ డైలాగ్‍  విజిల్స్ వేయించేలా  ఉంది. ముఖ్యంగా తమన్‍ బ్యాక్‍గ్రౌండ్‍ స్కోర్‍ అదిరిపోయింది. ఇప్పటికే ఈ టీజర్‍ 40 మిలియన్‍ వ్యూస్‍తో ఈ పాట యూట్యూబ్‍లో సరి కొత్త రికార్డు క్రియేట్‍ చేసి  (ఏప్రిల్‍ 25నాటికి) దూసుకు పోతుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్‍ ప్రొడ్యూసర్‍ మిర్యాల రవీందర్‍ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‍గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‍ జరుపుకుంటోన్న ఈ చిత్రం దివగంత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే28న  ప్రపంచవ్యాప్తంగా కానుందని ప్రకటించారు చిత్ర యూనిట్‍. మరి పరిస్థితులు చక్కబడితే... సరి! అనుకున్న సమయానికి చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. లేదంటే మరో తేదీ ప్రకటించే అవకాశం వుంది. నటసింహ నందమూరి బాలక•ష్ణ, ప్రగ్యా జైస్వాల్‍, శ్రీకాంత్‍తో పాటు భారీతారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‍, సంగీతం: తమన్‍ ఎస్‍, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్ డైరెక్టర్‍: ఎ.ఎస్‍.ప్రకాష్‍, ఎడిటింగ్‍: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్: రామ్‍-లక్ష్మణ్‍, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‍రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

విక్టరి వెంకటేష్‍ సినిమా నారప్ప మే 14 వస్తుందా...? 

విక్టరి ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్‍ హీరోగా,మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్‍ అడ్డాల దర్శకత్వంలో సురేష్‍ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై  స్టార్‍ ప్రొడ్యూసర్స్ సురేష్‍ బాబు, కలైపులి ఎస్‍. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం నారప్ప. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్తో పాటు విక్టరీ వెంకటేష్‍ బర్త్డే సందర్భంగా రిలీజైన నారప్ప టీజర్‍కి ట్రెమండస్‍ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్‍ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‍ కార్యక్రమాలు  ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నారప్ప ఫ్యామిలీతో కూడిన స్పెషల్‍ ఫ్యామిలి పోస్టర్‍ని విడుదల చేసింది చిత్ర యూనిట్‍. తెలుగు వారి సాంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో విక్టరి వెంకటేష్‍ నడిచివస్తోన్న ఈ పోస్టర్‍కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మే 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్‍ రిలీజ్‍ చేసారు చిత్ర యూనిట్‍. 

‘దృశ్యం 2’  విడుదల కూడా ఈ ఏడాదే...

మోహన్‍ లాల్‍, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళీ వర్షన్‍ ‘దృశ్యం 2’  ఓటీటీ ద్వారా విడుదలై సూపర్‍ డూపర్‍ హిట్‍ అయ్యింది. ఈ సినిమా దృశ్యం సీక్వల్‍ అయితే  తెలుగు వర్షన్‍ రిలీజ్‍ గురించి రక రకాల పుకార్లు షికార్లు కొడుతున్న నేపధ్యంలో నిర్మాత సురేష్‍ బాబు క్లారిటీ ఇచ్చారు. సినిమాకు సంబంధించి ఏ సమాచారమైనా తామే అఫీషియల్‍గా ప్రకటిస్తామని అన్నారు. అప్పట్లో వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఏ రేంజ్‍ హిట్‍ సాధించిందనేది మనందరికీ తెలుసు. కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా హిట్‍ పట్టేయడం ఖాయం అని నిరూపించింది ఈ సినిమా. మోహన్‍ లాల్‍, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ బ్లాక్‍బస్టర్‍ సినిమాను తెలుగు, తమిళ్‍, హిందీ భాషల్లో రీమేక్‍ చేయగా భారీ సక్సెస్‍ సాధించింది. దీంతో అన్ని భాషల్లోనూ దృశ్యం2 పేరుతో ఈ మూవీ సీక్వెల్‍ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‍ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్‍ బాబు. ఒరిజినల్‍ వర్షన్‍కు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్‍ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు.  ఇది థియేటర్లలో విడుదలవ్వాల్సిన సినిమా అని అంతా అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో వెంకటేష్‍, మీనా జంటగా రూపొందిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీ వేదికపై రిలీజ్‍ కాబోతుందనే వార్తలు వైరల్‍ కావడంతో దీనిపై నిర్మాత దగ్గుబాటి సురేష్‍ బాబు రియాక్ట్ అయ్యారు ‘దృశ్యం 2’ తెలుగు వర్షన్‍ కూడా ఓటీటీ వేదికపైనే రిలీజ్‍ కాబోతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, థియేటర్లు ఎప్పుడు పూర్తి స్థాయిలో ఓపెన్‍ అయితే అప్పుడే ‘దృశ్యం 2’ ను విడుదల చేస్తామని సురేష్‍ బాబు అన్నారు. ఒకవేళ ఓటీటీ వెళ్లాలంటే తామే ప్రకటిస్తాం తప్ప ఇలాంటి రూమర్స్ నమ్మకండి అని ఆయన తెలిపారు

‘రాధే శ్యామ్‍’ జూలై 30న రిలీజ్‍ ఉండొచ్చు!

పాన్‍ ఇండియా మూవీస్‍  ‘బాహుబలి’, ‘సాహో’ సినిమా తర్వాత రాధాక •ష? దర్శకత్వంలో క •ష?ం రాజు సమర్పణ లో యు వి క్రియేషన్స్ బ్యానర్‍ లో  యంగ్‍ రెబల్‍స్టార్‍ ప్రభాస్‍ నటిస్తున్న మరో పాన్‍ ఇండియా  చిత్రం ‘రాధే శ్యామ్‍’. ప్రభాస్‍ సినిమా ఎప్పుడు వస్తుందా. అతన్ని థియేటర్‍లో ఎప్పుడు చూద్దామా అనే రేంజ్‍లో దేశవ్యాప్తంగా అతనికి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ‘జిల్‍’ ఫేమ్‍ రాధాకృష్ణ కుమార్‍ డైరక్షన్‍లో చేస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‍’.  ఈ సినిమా ఫస్ట్లుక్‍, గ్లింప్స్ని చాలాకాలం క్రితం వదిలారు. ఆ తర్వాత సినిమా యూనిట్‍ నుంచి ఎటువంటి అప్‍డేట్‍ లేదు. దీంతో కొద్దిరోజుల క్రితం నిర్మాణ సంస్థను టార్గెట్‍ చేస్తూ.. ‘నిద్ర లే యూవీ క్రియేషన్స్’ అంటూ ప్రభాస్‍ ఫ్యాన్స్ ట్విట్టర్‍లో రచ్చ చేశారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రభాస్‍ పోస్టర్‍ని విడుదల చేసి ఫ్యాన్స్కి సర్‍ప్రైజ్‍ ఇచ్చింది రాధేశ్యామ్‍ యూనిట్‍. పిరియాడికల్‍ లవ్‍ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్‍ సరసన హీరోయిన్‍గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్‍ ఇండియా చిత్రంగా ఈ సినిమాని రూపొందించారు. ఈ షూటింగ్‍ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది.

మరోవైపు ప్రభాస్‍ ఓం రౌత్‍ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‍’ అనే మరో గ్రాండ్‍ ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. రామాయణ మహాకావ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీతగా క•తి సనన్‍, లక్షణ్ముడిగా సన్ని సింగ్‍ నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్‍ నటుడు సైఫ్‍ అలీ ఖాన్‍ లంకేశ్వర రావణాసుర పాత్రలో చేస్తున్నాడు.

అక్టోబర్‍ 13న ‘రౌధ్రం రణం రుధిరం’ (ఆర్‍ఆర్‍ఆర్‍)

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‍ఆర్‍ఆర్‍) పాన్‍ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‍చరణ్‍, కొమురంభీమ్‍గా జూనియర్‍ ఎన్టీఆర్‍ నటిస్తున్నారు. చెర్రీతో ఆలియా భట్‍ జోడీ కడుతుండగా తారక్‍కు జంటగా హాలీవుడ్‍ నటి ఒలీవియా మోరిస్‍ నటించనున్నారు. అజయ్‍ దేవ్‍గన్‍ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు . ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్‍ చరణ్‍ ‘భీం ఫర్‍ రామరాజు’, ఎన్టీఆర్‍ ‘రామరాజు ఫర్‍ భీం’ వీడియోలు రికార్డులు క్రియేట్‍ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‍తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్‍ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‍ జరుపుకుంటుంది. దసరా కానుకగా, అక్టోబర్‍ 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అని చిత్ర యూనిట్‍ ప్రకటించింది మరి అప్పటికి కరొన మూట ముళ్ళు సర్దుకుంటుందో లేదో... థియేటర్లు తెరిచేదాని బట్టి విడుదల ఉంటుంది.

‘పుష్ప’ ఆగస్టు 13కు రెడీ అయింది...?

అల్లు అర్జున్‍ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్‍ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.  సుకుమార్‍ దర్శకత్వంలో.. అల్లు అర్జున్‍ కాంబినేషన్‍లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఫస్ట్లుక్‍ పోస్టర్‍తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‍ అయితే మామూలుగా లేదు. సూపర్‍హిట్‍ కాంబినేషన్‍ అల్లుఅర్జున్‍, స్టైలిష్‍ డైరెక్టర్‍ సుకుమార్‍ కాంబినేషన్‍లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‍ చిత్రం ‘పుష్ప’. ఇంతకాలం స్టైలిష్‍స్టార్‍గా ఉన్న అల్లు అర్జున్‍ని ఈ సినిమా ద్వారా ఐకాన్‍ స్టార్‍ పరిచయం చేసి తన ట్రేడ్‍ మార్క్ను చూపించాడు సుకుమార్‍. ఎర్రచందనం స్మగ్లింగ్‍ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‍ లారీడ్రైవర్‍ ‘పుష్పరాజ్‍’ పాత్రలో కనిపించనున్నాడు. ఫస్ట్లుక్‍తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్‍. ఈవెంట్‍ని పెట్టి మరీ టీజర్‍ను వదిలారు మూవీ యూనిట్‍. ఇక ఈ టీజర్‍ మామూలుగా లేదు. భారీ యాక్షన్‍, అద్భుతమైన విజువల్స్, కేక పుట్టించే బ్యాక్‍గ్రౌండ్‍ మ్యూజిక్‍ ఈ టీజర్‍ని ఓ రేంజ్‍లో పెట్టాయి. ముఖ్యంగా టీజర్‍లో ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్‍ చెప్పిన ఏకైక డైలాగ్‍ అన్నిటికన్న హైలైట్‍. అల్లు అర్జున్‍ అన్నట్లుగానే పుష్ప టీజర్‍ ఎక్కడా తగ్గడం లేదు. ఏ హీరో సాధించని ఓ అరుదైన రికార్డును ఈ టీజర్‍ ద్వారా బన్నీ సాధించాడు. టీజర్‍ యూట్యూబ్‍ వదిలిన 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్‍ సాధించి.. తెలుగు ఇండస్ట్రీలో కనీవినీ రికార్డును బన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు.  మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్‍పై పాన్‍ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో బన్నీ సరసన హీరోయిన్‍గా నటిస్తుండగా.. మలయాళం స్టార్‍ ఫవాద్‍ ఫాజిల్‍ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 13, 2021న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య కూడా ఆగష్టులో విడుదల ఉంటుంది కదా మరి ‘పుష్ప’  కూడా డేట్‍ మార్చుకోవచ్చు..

‘కే.జీ.ఎఫ్‍-2  రిలీజ్‍ డేట్‍ మారనుందా?

భారీ యాక్షన్‍ చిత్రం ‘కే.జీ.ఎఫ్‍-2’ కూడా ఇదే పరిస్థితి వస్తుందనే టాక్‍ బలంగా వినిపిస్తుంది. భారీ బడ్జెట్‍తో రూపొందిన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కే.జీ.ఎఫ్‍ చాప్టర్‍ 1  ఉత్తర భారతదేశంలో కూడా రికార్డు కలెక్షన్స్ నమోదు చేసుకుంది. దీనిని ద•ష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఏకకాలంలో అన్ని భాషల్లో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో, సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. రాక్‍స్టార్‍ యశ్‍ హీరోగా తెరకెక్కిన ‘కే.జీ.ఎఫ్‍’ సినిమా సీక్వెల్‍గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రశాంత్‍ నీల్‍ దర్శకత్వంలో భారీ యాక్షన్‍ ఎంటర్‍టైనర్‍గా తెరకెక్కిన కే.జీ.ఎఫ్‍ ఏ రేంజ్‍లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి భాగం చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు రెండో భాగం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జూలై 16న సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‍ సెకండ్‍ వేవ్‍ రావడం.. థియేటర్లు మూతపడటంతో సినిమా విడుదల తేదీ మారుతుందేమోనని అనుకుంటున్నారు.

మరికొన్ని చిత్రాల పరిస్థితి...

ఇంకా పవర్‍ స్టార్‍ పవన్‍ కళ్యాణ్‍ ‘అయ్యప్పన్‍ కోషియామ్‍’ రీమేక్‍ చిత్రం షూటింగ్‍ మొదలైంది, కానీ కరోనా కారణంగా తాత్కాలికంగా షూటింగ్‍ నిలిపివేశారు. అదే విధంగా సూపర్‍ స్టార్‍ మహేష్‍ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’  షూటింగ్‍ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయినా ఈ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల ఉంటుందని చెప్తున్నారు. ఇవి కాకుండా మాస్‍ మహారాజ  రవి తేజ ‘ఖిలాడీ’,  రానా ‘విరాట పర్వమ్‍’  నాగ చైతన్య ‘లవ్‍ స్టోరీ’ నాని ‘టక్‍ జగదీశ్‍’ నితిన్‍ ‘మాస్ట్రో’ ఈ సినిమాను జూన్‍ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.  అఖిల్‍ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్‍ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్‍ తెరకెక్కిస్తున్న రొమాంటిక్‍ ఫ్యామిలీ ఎంటర్‍టైనర్‍ మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍.ఈ సినిమాను జూన్‍ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్‍. డైనమిక్‍ డైరెక్టర్‍ పూరి జగన్నాథ్‍  యంగ్‍ అండ్‍ ప్రామిసింగ్‍ హీరో విజయ్‍ దేవరకొండ ఫస్ట్ ప్యాన్‍ ఇండియా మూవీ ‘లైగర్‍’ (సాలా క్రాస్‍బ్రీడ్‍). సాయితేజ్‍, దేవ్‍ కట్ట కాంబినేషన్‍లో రూపొందుతోన్న పొలిటికల్‍ థ్రిల్లర్‍ రిపబ్లిక్‍, సందీప్‍ కిషన్‍, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్ కార్పొరేషన్‍, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‍ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. ఇలా ఎన్నో చిత్రాలు తమ విడుదల తేదీలు వాయిదా వేసుకున్నాయి.

(రాంబాబు వర్మ)

 

Tags :