MKOne Telugu Times Business Excellence Awards

అల్లు శతజయంతి వేడుకలు

అల్లు శతజయంతి వేడుకలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శతజయంతి వేడుకలను జరుపకుంటున్న అలనాటి హాస్యనటుడు కీ.శే. అల్లురామలింగయ్య శతజయంతి వేడుకలను సంబరాల్లో ఏర్పాటు చేశారు. వెండితెరపై వందలాది పాత్రలు, ఏ పాత్ర చేసినా తన హావభావాలతో మెప్పించి హాస్యం పండించిన నటునిగా ఆయన తెలుగు ప్రేక్షకుల్లో స్థిరపడిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకునేలా నాట్స్‌ సంబరాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

 

 

Tags :