Radha Spaces ASBL

ఎపిలో వాణిజ్య ఉత్సవం ప్రారంభం

ఎపిలో వాణిజ్య ఉత్సవం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్నీరంగాలతోపాటు పారిశ్రామికంగా కూడా గణనీయ వృద్ధి సాధించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు.  2021లో ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదయిందని అన్నారు. 2020-2021లో ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్న సీఎం రెండేళ్లలో రూ.20,390 కోట్లతో 10 మెగా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ద్వారా  55 వేల మందికి ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. 68 మెగా పరిశ్రమలతో రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. మరో 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఏపీ పారిశ్రామికంగా మరింత ముందంజ వేసేందుకు పరిశ్రమ వర్గాలు సహకరించాలని సీఎం జగన్‌ కోరారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :