Radha Spaces ASBL

టీడీపీ సభలో లేకున్నా క్లాస్ పీకిన సీఎం జగన్

టీడీపీ సభలో లేకున్నా క్లాస్ పీకిన సీఎం జగన్

ఏపీ బడ్జెట్ సెషన్.. వన్డే మ్యాచ్‌లా ముగిసిపోయింది. ఒక్కరోజు సమావేశంలో.. బడ్జెట్ తప్ప ఇంకేమీ ఉండదనుకున్నారు. కానీ.. సీఎం జగన్ ఆ కొన్ని గంటల్లోనే విపక్షాలకు గట్టిగా ఇచ్చిపడేశారు. ఆయన స్పీచ్ చూస్తే.. నించున్న దగ్గర్నుంచే.. సమావేశాన్ని బాయ్ కాట్ చేసి ఇంట్లో ఉన్న అపొజిషన్ లీడర్లకు క్లాస్ తీసుకున్నట్లనిపించింది. పంచ్‌లు పేలుస్తూ.. సెటైర్లు వేస్తూ.. కోవిడ్ టైంలో విపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టేశారు జగన్. ఎన్నికల మేనిఫెస్టో నుంచి మొదలు.. మొన్నటిదాకా జరిగిన ఎలక్షన్లను ప్రస్తావిస్తూ.. కోవిడ్ కట్టడికి తీసుకున్న చర్యలను వివరిస్తూ.. రాష్ట్రంలో వేసిన వ్యాక్సిన్ చివరి డోసు దాకా.. అన్నీ వివరంగా చెప్పేశారు సీఎం జగన్.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించారు సీఎం జగన్. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే.. ప్రజలు తమకు అండగా నిలుస్తున్నారన్నారు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా.. వైసీపీ జెండానే ఎగురుతోందని చెప్పారు. ప్రజలిచ్చిన షాక్‌తోనే.. ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో కాలుపెట్టే ధైర్యం కూడా చేయలేకపోయాయని సెటైర్ వేశారు. కుట్రలు చేసి పంచాయతీ గోడలపై నీలం, ఆకుపచ్చ రంగులను తుడిపేశారేమోకానీ.. ప్రజల హృదయాల నుంచి మాత్రం ఆ రంగులను తీయలేకపోయారన్నారు.

ఇక.. ఎన్నికల మేనిఫెస్టో అంటే అబద్ధాల పుస్తకంగా ఉండేదని.. ఎలక్షన్స్ అయిపోగానే అది చెత్తబుట్టలో పడేసేవారని సీఎం జగన్ చెప్పారు. మేనిఫెస్టో అంటే.. తమకు పవిత్ర గ్రంథంగా భావిస్తామని చెప్పారు. తామిచ్చిన 129 వాగ్దానాల్లో.. కేవలం 7 మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు. రెండేళ్లు కూడా నిండకుండానే 95 శాతం పూర్తి చేశామన్నారు సీఎం జగన్.

రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రతిపక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని.. సీఎం జగన్ చెప్పారు. దేశంలో నెలకు 7 కోట్ల వ్యాక్సిన్ డోసులు మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని చెప్పారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే.. మొత్తం 7 కోట్ల డోసులు కావాలన్నారు. కేంద్రం 76 లక్షల డోసులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. ప్రతిపక్షాలకు చెందిన నేతలు.. వాస్తవాలు తెలిసి కూడా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. గ్లోబల్ టెండర్లు పిలిచి.. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామన్నారు సీఎం.

కోవిడ్ పరిస్థితుల్లో.. అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు సీఎం జగన్. అంతే తప్ప.. జరిగిన తప్పులను వేలెత్తి చూపడం వల్ల సాధించేదేముందని ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో.. ఒకరినొకరు ప్రోత్సహించడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని కోరారు. కోవిడ్ సెకండ్ వేవ్ కాలంలో విపక్షాలు చేసిన విమర్శలన్నింటిని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టేశారు జగన్. ప్రతిపక్షాలు ఇప్పటికైనా మారాలని.. అనవసర విమర్శలు, ఆరోపణలు చేయొద్దని.. తన స్టైల్లో అందరికీ క్లాస్ తీసుకున్నారు

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :