MKOne Telugu Times Youtube Channel

ఎపిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి చేయండి

ఎపిలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు పూర్తి చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి తొలి దశ డిజిటల్‌ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ పనుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి డిజిటల్‌ లైబ్రరీలో డెస్క్‌టాప్‌, యూపీఎస్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్‌ టేబుల్స్‌, సిస్టం చెయిర్స్‌, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, ఐరన్‌ ర్యాక్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. డిజిటల్‌ లైబ్రరీల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఫేజ్‌-1 లో మిగిలిపోయిన డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్‌ 2లో కవర్‌ అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని, ఇంకా మొదలు కాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు.

పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. మంత్రి గౌతమ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, అధికారులు హాజరయ్యారు.

 

Tags :