ఎంతటివారున్నా వదిలిపెట్టం : సీఎం రేవంత్ హెచ్చరిక
కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయి. దీంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయి. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండి. వాటిని కూల్చే బాధ్యత తీసుకుంటాం. కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా, కోర్టులో కొట్లాడతాం. హైదరాబాద్ కాలుష్యం నల్గొండకు చేరుతోంది. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తాం. ఇక్కడ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నారు. వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుంది. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్నారు.