MKOne TeluguTimes-Youtube-Channel

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు.  బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేసుకున్న ముఖ్యమంత్రులు కేసీఆర్‌, పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌కు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్చరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో సత్కరించారు.

 

 

Tags :